• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

RTV NEWS NETWORK

RTV NEWS NETWORK

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • విజయవాడ
  • వైజాగ్
  • Opinion
  • 🗳️Elections

Veera Swamy

Speaker: చంద్రబాబు నిప్పు అయితే నిరూపించుకోవాలి

Published on October 5, 2023 6:32 pm by Veera Swamy

టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పుంకాలు, పుంకాలుగా బయటకు వస్తున్నాయన్నారు. సమాజంలో న్యాయ వ్యవస్థ కన్నా, రాజకీయ వ్యవస్థ కన్నా, మీడియా వ్యవస్థ కన్నా పౌరుడు గొప్పవాడన్నారు. చంద్రబాబు తాను ఉప్పు, పప్పు అంటున్నాడని తెలిపిన తమ్మినేని.. బాబు నిప్పు అని నిరూపించుకోవాలని, ఎవరు ఏమీటనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. తాము చంద్రబాబు గురించి ఎవరికీ చెప్పనవసరం లేదన్న ఆయన.. చంద్రబాబు అవినీతిపై మీడియానే ప్రజలకు వివరిస్తున్నాయన్నారు.

చంద్రబాబు వేదాలు వల్లిస్తున్నారని తమ్మినేని సీతారాం తెలిపారు. అక్టోబర్‌ 2న దీక్ష చేయడం వల్ల సత్యాగ్రహ అర్దం పరమార్దం దెబ్బతిన్నాయన్నారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబు బేయిల్ ఇవ్వమని దీక్ష చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్దిక నేరగాడు సత్యాగ్రహణం చేయడం ఏంటన్న ఆయన.. చంద్రబాబు ఏమైనా దేశం కోసం పోరాటం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి పరుడని జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకున్నారని తమ్మనేని మండిపడ్డారు.

టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే తాను సైతం అవినీతికి పాల్పడుతానని పవన్ కళ్యాణ్‌ పరోక్షంగా ముందే చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఉన్న బంధం ఎలాంటిదో ఆర్దమైందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలు మరోసారి టీడీపీకి ఓటు వేయరని జోస్యం చెప్పారు. టీడీపీ బలహీన స్థితిలో ఉందన్న తమ్మినేని సీతారాం.. టీడీపీ పగ్గాలు పవన్ కళ్యాణ్ తీసుకున్నారన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు జైల్లో కూర్చొని పవన్‌ చేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

Sajjala Ramakrishna Reddy: పవన్ కళ్యాణ్‌ టీడీపీని టేకోవర్‌ చేసుకున్నారు

Published on October 5, 2023 5:38 pm by Veera Swamy

టీడీపీ-జనసేన పార్టీలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ రెడ్డి ట్రిబ్యుషనల్‌ సమీక్ష అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. టీడీపీ నేతలు దీనిపై రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ఆయన.. సోమవారమే కృష్ణ ట్రిబ్యుషన్‌ సమీక్ష అంశం వచ్చిందన్నారు. కృష్ణా జలాల అంశాన్ని తిరగతోలడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్‌తో ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. మరోవైపు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. తెలుగు దేశం పార్టీ బలహీన పడిందని పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు.

టీడీపీని పవన్‌ కళ్యాణ్‌ టేకోవర్‌ చేసుకున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్‌ జనసేనతో పాటు టీడీపీకి సైతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీని టేకోవర్‌ చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పాలన్నారు. సీఎం జగన్‌ ఢీల్లీ టూర్‌పై అసత్య ప్రచారం జరుగుతుందన్న ఆయన.. చంద్రబాబు కేసుల గురించి జగన్‌ కేంద్రం పెద్దలతో మాట్లాడటానికి వెళ్లారని విపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్లారన్న సజ్జల.. చంద్రబాబు కేసుల గురించి మాట్లాడే అవసరం జగన్‌కు ఏముందన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ఆంశాల గురించి సీఎం కేంద్రం పెద్దలతో మాట్లాడారని సజ్జల రామృష్ణా రెడ్డి తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్ పరారీలో ఉన్నరని సజ్జల రామకృష్ణారెడ్డి.. శ్రీనివాస్‌ త్వరగా తిరిగి వస్తే చంద్రబాబు కేసు తేలుతోందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ను త్వరగా తిరిగి రమ్మని చెప్పాలన్నారు. బాబు కేసులో ఆయన తరపు లాయర్లు టెక్నికల్ అంశాల పైనే మాట్లాడుతున్నారని సజ్జల రామృష్ణా రెడ్డి వెల్లడించారు. వైఎస్‌ మరణాన్ని, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని టీడీపీ-జనసేన నేతలు చిన్న పిల్లలతొ తిట్టించడం దారుమన్నారు.

Kalava Srinivas: జగన్‌ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు

Published on October 5, 2023 3:03 pm by Veera Swamy

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, రాయలసీమకు నీటి వనరులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్‌ పాలనలో రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా నష్టం జరుగుతోందన్న ఆయన.. జగన్‌ రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం రాయలసీమకు అన్యాయం చేశారని కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా జగన్‌ వల్ల బ్రిజేష్ కుమార్‌ తీర్పులో ఎక్కువ అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.

ఆనాడు రాజశేఖర్‌ రెడ్డి మరణ శాసనం రాస్తే.. నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి లాలూచీ కారణంగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ హక్కులు కాలరాయబడుతున్నాయని కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు భవిష్యత్తులో సాగు, తాగునీటి కష్టాలు వస్తాయన్న ఆయన దానిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. జగన్‌ స్వార్థం కోసం రాయలసీమ భవిష్యత్తు తాకట్టుపెట్టారని విమర్శించారు.

గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంపై మంత్రి అంబటి రాంబాబు అర్దంలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆనాడు చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రాజెక్టులు గతంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారన్న ఆయన.. సీమ ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Kiran Royal: రోజా భాగోతం బయటపెడుతాం.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు

Published on October 3, 2023 9:35 pm by Veera Swamy

ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్‌ రాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజా గ్లిజరిన్‌ పూసుకొని ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. తన మనోభావాలు దెబ్బతిన్నాయని వెక్కి వెక్కి ఏడ్చిన రోజాకు పవన్‌ కళ్యాణ్‌ కుటుంబాన్ని విమర్శించిన సమయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలియలేదా అని ప్రశ్నించారు. రోజాను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే రోజాకు నిజమైన ఏడుపులు చూపిస్తామని జనసేన నేత హెచ్చరించారు.

మరోవైపు రోజాకు మాజీ మంత్రి బండారు సత్య నారాయణ గురించి ఎందుకని కిరణ్‌ ప్రశ్నించారు. రోజా భాగోతం ఏదో ఉంది కాబట్టే ఆమె భయపడుతోందని జనసేన నేత అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి రోజా ఏడుస్తోందని ప్రజలు టపాసులు కాల్చుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారన్న ఆయన.. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక రోజాను మూడు సంవత్సరాలు జైల్లో కూర్చోబెడుతామన్నారు. మరోవైపు జోగి రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేత.. జోగి రమేష్‌ సీఎం సంక నాకుతూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు.

జోగి రమేష్‌ ప్రజలకు అందాల్సిన చెక్కెర, బియ్యం, జీడిపప్పుతో సీఎం జగన్‌ వద్దకు వెళ్లుతున్నాడని ఎద్దేవా చేశారు. జోగి రమేష్‌ పెనడలో జనసేన నిర్వహించనున్న వారాహి యాత్ర అడ్డుకుంటానని హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వారిహి యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తిరుపతి నియోజకవర్గ జనసేన ఇంచార్జి కిరణ్‌ రాయల్‌ హెచ్చరించారు. జోగి రమేష్‌ గూర్జా మంత్రి అన్న ఆయన.. ఈ మంత్రిని మళ్లీ నేపాల్‌ పంపిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ వైసీపీ నాయకుడని, అతడికి టీడీపీ-జనసేన పార్టీలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.

Tirupat: బాలుడి కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పీ

Published on October 3, 2023 9:00 pm by Veera Swamy

తిరుపతి బస్టాండ్‌లోకిడ్నాప్‌ అయిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. బాలుడిని నిందితుడు సుధాకర్ తీసుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. సుధాకర్‌ చిన్నారిని ఏర్పేడులోని తన అక్క ఇంటికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడు ఏర్పేడులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుడి నుంచి బాలుడ్ని తీసుకొని ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడకు చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులకు పోలీసులు చిన్నారిని అప్పగించారు. కాగా బాలుడు కిడ్నాప్‌ అయిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఈ కేసును చేధించడంతో జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని అభినందించారు.

పూర్తిగా చదవండి..

బాలుడ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తి సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపిన జిల్లా ఎస్పీ.. నిందితుడిపై గతంలో ఎలాంటి కేసులు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల చేతులను ఎట్టి పరిస్ధితుల్లో వదిలకూడదని, రాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఎవరైనా కన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి సూచించారు.

తిరుమతి ఆర్టీసీ బస్టాండ్‌లో అర్థరాత్రి రెండేళ్ల బాబు కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ ఘటన నిన్న రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం శ్రీవారి దర్శనానికి చెన్నైకి చెందిన చంద్రశేఖర్-మీనా దంపతులు తమ రెండో కుమారుడు మురుగేశన్‌ తో కలిసి వచ్చారు. అయితే.. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో ఆ బాలుగు కిడ్నాప్ కు గురైనట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ వయస్సు సుమారు32 సంవత్సరాలు ఉండవచ్చు అని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్ వైట్ షూ, గ్రీన్ కలర్ షర్ట్‌తో వేసుకుని ఉన్నాడని తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ నుంచి బాలుడ్ని బస్టాండ్ బయట గల అంబేద్కర్ విగ్రహం వైపు ఆ కిడ్నాపర్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. వరుస సెలవుల నేపథ్యంలో చెన్నైకి చెందిన ఒక కుటుంబం మూడు రోజుల క్రితం తిరుమలకు వచ్చింది. స్వామి వారి దర్శనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో తిరుపతి బస్‌స్టాప్‌లో చెన్నై బస్ కోసం ఎదురుచూస్తుండగా బాలుడి కిడ్నాప్ జరిగింది. అప్పటివరకు కూడా పిల్లోడిని ఎంతో జాగ్రత్తగా తండ్రి చూసుకున్నట్లుగా కూడా సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టం అవుతోంది. అదే సమయంలో పిల్లోడికి ఆకలిగా ఉంటే.. కొన్ని తినుబండారాలు, పాలు అలాంటివి కొనేందుకు తండ్రి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పిల్లలకి కావలసిన కొనిచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తండ్రి అక్కడే కొద్దిసేపు బస్ కోసం ఎదరు చూశారు. బస్సు రాకపోవటంతో కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా కాసేపు పడుకున్నారు. తల్లిదండ్రులు నిద్రపోతున్నది చూసి.. ఇంతలో బస్టాండ్ ఆవరణంలో తిరుగుతున్న దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 2 గంటల సమయంలో బాబుని కిడ్నాప్ చేశారు. బాబు ఎత్తుకెళ్ళిన ఇద్దరూ అనుమానితులను పోలీసులు గుర్తించారు.

Revanth Reddy: సుప్రీంకోర్టులో రేవంత్‌ రెడ్డికి చుక్కెదురు

Published on October 3, 2023 7:54 pm by Veera Swamy

టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు అతినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, అది ఎన్నికల కమీషన్‌ కిందకు వస్తుందని దాఖలైన పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో దీనిపై రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేస్తూ రేవంత్‌ రెడ్డి వేసిన పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో రేవంత్‌ రెడ్డి హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఇవాళ ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ పిటీషన్‌ను కొట్టివేసింది. కాగా రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాది తర్వాత తెలంగాణ టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను కోరారు. దీనికి ఆయనకు 50 లక్షల రూపాయలను ఇవ్వబోయారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారం ఈ దృష్యాలను రికార్డ్‌ చేసిన ఎమ్మెల్యే.. సీఎం కేసీఆర్‌కు పంపారు. దీంతో ఇది అప్పట్లో పెను సంచలనంగా మారింది. పోలీసులు ఆయన్ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆ సమయంలో పోలీసులు రేవంత్‌ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఎవరు ఇంత డబ్బు ఇచ్చారని ప్రశ్నించగా.. తనకు ఈ డబ్బును తన బాస్‌ ఇచ్చాడని రేవంత్ రెడ్డి బదులు ఇచ్చాడు. కానీ తన బాస్‌ ఎవరనేది ఆయన చెప్పలేదు. కాగా రేవంత్‌ రెడ్డి పట్టుబడ్డ సమయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఇది కూడా అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు ఒక సీఎం ఫోన్‌ ట్యాంపరింగ్‌ చేస్తారా.. అని ప్రశ్నించారు. తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి కాదని సోషల్ మీడియాలో చంద్రబాబుపై ట్రోలింగ్‌కు గురయ్యాడు.

ALSO READ: తెలంగాణ బీఎస్పీ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ!

  • Go to page 1
  • Go to page 2
  • Go to page 3
  • Interim pages omitted …
  • Go to page 68
  • Go to Next Page »

Primary Sidebar

India vs South Africa

India vs Soth Africa: సౌతాఫ్రికాలో టీమిండియా తీరిది.. ఈసారైనా ఆ ఘనత సాధిస్తారా?

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Pakistan Cricket: జాత్యహంకార స్కోరు కార్డు.. క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా!

Apara Sanjeevani Bhringaraju in Ayurveda..Wonderful benefits of oil

Bhringraj Benefits: ఆయుర్వేదంలో అపర సంజీవని భృంగరాజు..నూనెతో అద్భుత ప్రయోజనాలు

salaar new date

Movies:మొదటిదానిలో దేవా..రెండో దానిలో సలార్..ట్రైలర్ ఇరగదీయాల్సిందే

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?

IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్‌ కొరత తీరనుందా?

Pop Corn Health: సినిమా చూస్తూ పాప్ కార్న్ తింటున్నారా .. అయితే ఏమవుతుందో తెలుసా..!

Pop Corn Health: సినిమా చూస్తూ పాప్ కార్న్ తింటున్నారా .. అయితే ఏమవుతుందో తెలుసా..!

Revanth Reddy

మీ రేవంత్ అన్నగా నిలబడతా..రేపటి నుంచే ప్రజా దర్బార్.

Telangana CM - Revanth Reddy

మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. రెండు ఫైళ్లపై సంతకం

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online