టీడీపీ నిరసన కార్యక్రమాల్లో తొలిసారి తెలుగుదేశంతో కలిసి జనసేన పార్టీ పాల్గొనడం నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏలూరు టిక్కెట్ మాత్రం అటు టీడీపీ అభ్యర్దికి ఇస్తారా లేక జనసేన పార్టీ అభ్యర్దికి ఇస్తారా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయంటూ జనసేనాని ప్రకటించిన తరువాత బడేటి చంటిలో జోష్ తగ్గింది. ప్రస్తుతం ఆయన నామమాత్రంగానే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దింతో ఏలూరు టిక్కెట్ ఏ పార్టీ అభ్యర్దికి ఇస్తారనే ఉత్కంఠ ఏలూరు ఓటర్లలో నెలకొంది.
Trinath
ByTrinath
తమిళనాడులోని అరియలూర్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9మంది ప్రాణాలు కోల్పోయారు. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండో ఘటన ఇది. మైలాడుదురైలో అక్టోబర్ 5న జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వరుస పెట్టి బాణాసంచా ఫ్యాక్టరీల్లోనే ప్రమాదాలు జరుగుతుండడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ByTrinath
తెలంగాణ ఎన్నికలు కేసీఆర్‌ను జాతీయ నాయకుడిని చేస్తాయా.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ నేషనల్ వైడ్ హీరోగా మారనున్నారా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి నోటా వినిపిస్తున్నాయి. ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ పెంటపటి పుల్లారావు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కేసీఆర్ గెలిస్తే కాంగ్రెస్‌కు రాజకీయంగా తిప్పలు తప్పవని విశ్లేషించారు. రెండు జాతీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేసీఆర్ మళ్లీ ప్రయత్నిస్తారన్నారు.
ByTrinath
ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టేసింది. అటు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు. ఇటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది
ByTrinath
2011 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ తరుఫున ఆడిన ఆటగాళ్లు అందరూ ప్రస్తుత ప్రపంచకప్ టీమ్‌కి దూరమయ్యారు. బరేసీ మాత్రం ప్రస్తుత జట్టులో ఉండగా.. 2011 వరల్డ్‌కప్‌లో జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నాడు. నాడు కోహ్లీని అవుట్ చేసిన తర్వాత బరేసీ ఒక కామెంట్ చేశాడు. 'నిన్ను మళ్లి ఇక్కడ చూడము' అని కామెంట్ చేయగా.. ఇప్పుడా మాటను గుర్తు చేసుకున్నాడు బరేసీ. అయితే కోహ్లీ ఇంత దూరం వస్తాడని అసలు ఊహించుకోలేదని చెప్పుకొచ్చాడు.
ByTrinath
వరల్డ్‌కప్ నిర్వాహణ విషయంలో బీసీసీఐపై నానాటికి విమర్శలు పెరుగుతున్నాయి. ధర్మశాల అవుట్‌ఫీల్డ్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్‌తో పాటు మిగిలిన జట్టు ఆటగాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అఫ్ఘాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బాల్ కోసం ముజీబ్ డైవ్ చేయగా ఏకంగా గ్రౌండ్‌లో ఇసుక లేచి వచ్చింది. అటు ఐసీసీ(ICC) ప్రతినిధి అవుట్‌ఫీల్డ్ 'రేటింగ్ యావరేజ్' అని చెప్పాడు.
ByTrinath
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు ఊపందుకుంటున్నాయి. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నుంచి పలువురు నేతలు బీజేపీ(BJP)లో చేరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్‌రెడ్డి.. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు..
ByTrinath
వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత శుక్రవారం డెంగీ పరీక్షల్లో యువ ఓపెనర్ గిల్‌కు డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్న గిల్ భారత్‌తో కలిసి ప్రయాణించడంలేదని బీసీసీఐ సెక్రటరీ జయ్‌షా ప్రకటించారు. అక్టోబర్ 11న అఫ్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌తో పాటు అక్టోబర్ 14న పాక్‌తో మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు.
ByTrinath
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులను కవర్ చేస్తున్న జర్నలిస్టులు తమ ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా జర్నలిస్ట్ యూమ్నా ఎల్ సయ్యిద్ ఓ భననంపై నిలబడి రిపోర్ట్ చేస్తుండగా.. వెనుక ఉన్న పాలస్తీనా టవర్‌పై క్షిపణి దాడి జరిగింది. భయంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ యూమ్నా రిపోర్టింగ్‌ని కంటిన్యూ చేసింది.
ByTrinath
అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. టీమిండియా ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టాస్ పడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టుగానే గిల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. డెంగీతో బాధపడుతున్న గిల్ ఈ మ్యాచ్‌లో ఆడడంలేదు. అతను ఇంకా కోలుకోలేదు.. అటు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా ఆడనుంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tdp-jhanasena-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-accident-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kcr-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/chandrababu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohlii-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mijeeb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kishan-erddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fwt-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/aljajeera-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohli-jpg.webp)