తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. ఇవాళ(అక్టోబర్ 15) బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు కేసీఆర్. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పాల్గొని మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. తర్వాత అభ్యర్థులకు ఫారమ్‌లను అందిస్తారు. పార్టీ పెండింగ్‌లో ఉంచిన ఐదు నియోజకవర్గాల్లో కనీసం రెండింటికి కూడా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అటు సాయంత్రం హుస్నాబాద్‌కి వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Trinath
ByTrinath
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ హైవోల్టేజ్ ఫైట్‌లో రోహిత్ సేన ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన సెటైరికల్ ట్వీట్లకు భారత్ మాజీ లెజెండ్లు సచిన్, సెహ్వాగ్ తమదైన శైలీలో కౌంటర్లు ఇచ్చారు. పాక్ క్రికెటర్లకు ఫాఫ్డా జిలేబీ కనిపించిందని అందుకే 155/2 నుంచి 191కి ఆలౌట్ అయ్యే స్టేజీకి వచ్చారంటూ వేసిన కౌంటర్ ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ByTrinath
రోహిత్ శర్మ సిక్సర్ల ఊచకోత కొనసాగుతోంది. పాక్‌పై మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 86 రన్స్ చేసిన రోహిత్ ఖాతాలో కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకే ఇన్నింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన జాబితాలో రోహిత్ ఫస్ట్ ఉన్నాడు. 33 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రోహిత్ నాలుగు సార్లు 60కు పైగా సిక్సులు కొట్టాడు.
ByTrinath
గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో పాక్‌పై జరిగిన పోరులో భారత్ విక్టరీ కొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. గత మ్యాచ్‌లో అఫ్ఘాన్‌పై చెలరేగిన ఫామ్‌ని కొనసాగిస్తూ రెచ్చిపోయి ఆడాడు. రోహిత్ దూకుడుతో పాక్ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. రోహిత్ దూకుడుతో టీమిండియా ఈజీగా గెలిచేసింది.
ByTrinath
వరల్డ్ కప్ సీజన్ కావడంతో భారత్‌లో టీవీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. చాలా మంది పెద్ద స్క్రీన్ టీవీల కోసం ఎగబడుతున్నారట. అది కూడా ఇన్‌స్టెంట్ ఇన్‌స్టాలేషన్ కావాలని వినియోగదారులు అగుతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి. 55 అంగుళాలు అంతకంటే ఎక్కువ టీవీల అమ్మకాలు గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన దానికంటే 2-2.5 రెట్లు ఎక్కువ పెరిగినట్టు ఎల్జి కంపెనీ చెప్పింది.
ByTrinath
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన కెప్టెన్సీ ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను తన తెలివితేటలతో కట్టడి చేశాడు. 29ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి ఉన్న పాక్ ఒక దశలో 300 రన్స్ చేసేలా కనిపించింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఊహించని విధంగా బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్ సక్సెస్ అయ్యాడు. అప్పటికీ క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్‌ని అవుట్ చేశాడు. దీని తర్వాత మ్యాచ్ మలుపు తిరిగి పాక్ 192 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ByTrinath
క్రికెట్‌సందర్భానుసారంగా చూడడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు గేమ్ లవర్స్. క్రికెట్ ఎక్కువ చూసే వారిలో స్పోర్ట్స్‌మెన్‌షిప్ క్వాలిటీ పెరుగుతుందని చెబుతున్నారు. క్రికెటర్లు మ్యాచ్‌లో ఉపయోగించే స్ట్రాటజీలను ఫాలో అయితే అవి మనకు కూడా లైఫ్‌లో యూజ్ అవుతాయని చెబుతున్నారు. క్రికెట్ చూడడం వల్ల మనసు తేలికపడుతుందని.. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందంటున్నారు.
ByTrinath
ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మూడింటిలోనూ గెలిచింది. కచ్చితంగా సెమీస్‌కి వెళ్లే జట్లలో న్యూజిలాండ్ ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయంలో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తర్వాతి జరగబోయే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదని సమాచారం.
ByTrinath
అహ్మదాబాద్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగుతోండగా క్రికెట్ గాడ్ సచిన్ కామెంటరీ బాక్స్‌లో అలరించాడు. సచిన్ కామెంటరీ చేస్తుంటే అహ్మదాబాద్ బిగ్ స్క్రీన్‌పై 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ ఆడిన ఇన్నింగ్స్‌ని డిస్‌ప్లే చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా సచిన్..సచిన్ అంటూ నినాదాలు చేసి పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cm-kcr-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sachin-akthat-sehwag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-sharma-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-babar-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tv-prices-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cricket-fans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/captains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rohit-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sachin-kohli-jpg.webp)