author image

Trinath

IND vs BAN: మరో సంచలనం నమోదవుతుందా? జాగ్రత్తగా ఆడకపోతే అంతే సంగతి బాసూ!
ByTrinath

ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా టీమిండియా,బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.India vs Bangladesh

Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..!
ByTrinath

ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్‌ జట్టును బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ గెలిపిస్తున్నాడు. ఫీల్డింగ్‌ ఇంపాక్ట్‌ లిస్ట్‌లో నంబర్‌-1 పొజిషన్‌లో ఉన్నాడు కోహ్లీ. 22.3 పాయింట్లతో కోహ్లీ ఫీల్డింగ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్లలో టాప్‌ లో ఉండగా.. తర్వాతి స్థానంలో జో రూట్‌ (నాలుగు క్యాచ్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (ఐదు క్యాచ్‌లు) ఉన్నారు. భారత్‌ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ 14 ఫీల్డర్ల ఖాతాలో 14 క్యాచ్‌లు, 10 రన్స్ సేవ్‌ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.

IND vs BAN: ఆ సింహం రికార్డు బద్దలు కొట్టేందుకు బరిలోకి దూకుతున్న పులి.. ఇక బంగ్లాకు బ్యాండ్‌ బాజే..!
ByTrinath

టీమిండియా యువ సంచలనం శుభమన్‌ గిల్‌ మరో రికార్డుకు అతి దగ్గరలో ఉన్నాడు. మరో 67 రన్స్ చేస్తే దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం హషీమ్‌ అమ్లా రికార్డు బ్రేక్ అవుతుంది. గిల్‌ వన్డేల్లో 2 వేల రన్స్‌ మార్క్‌ను చేరుకోనున్నాడు. 36 ఇన్నింగ్స్‌లో గిల్ 1933 రన్స్ చేశాడు. అమ్లా 40 ఇన్నింగ్స్‌లో 2వేల రన్స్ చేశాడు.

AP Politics: వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరు..? టీడీపీ కంచుకోటలో ఫ్యాన్‌ గాలి వీస్తుందా?
ByTrinath

నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న దూకుడుకు కళ్లెం వేసేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట అయిన నర్సీపట్నంలో గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం నిజంగా పెను సంచలనం. అయితే గెలిచిన తర్వాత ఉమా శంకర్‌ గణేశ్‌ క్యాడర్‌ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

World Cup 2023: గుజరాత్‌ ఫ్యాన్స్‌పై పాక్‌ వార్‌.. ఐసీసీకి ఇచ్చిన కంప్లైంట్‌లో ఏం ఉందంటే?
ByTrinath

పాకిస్థాన్ జర్నలిస్టులకు వీసాల జాప్యంపై ఆ దేశ బోర్డు మండిప‌డుతోంది. ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఐసిసికి మరోసారి కంప్లైంట్ ఇచ్చింది. ఇక అక్టోబరు 14న జరిగిన ఇండియా వర్సెస్ పాక్‌ మ్యాచ్ సందర్భంగా టీమ్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్ లక్ష్యంగా క్రౌడ్ చేసిన అనుచిత ప్రవర్తనను సీరియ‌స్‌గా తీసుకున్న‌ పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

Viral Video: క్రికెట్ వరల్డ్ కప్ వేదికలో పెను ప్రమాదం.. ఈదురుగాలులతో ఊడిపడిన బోర్డు!
ByTrinath

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో ఒక బోర్డు ఊడి ప్రేక్షకుల మధ్యలో పడింది. లక్నోలోని అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.

World Cup: జట్టులో నలుగురు ఆటగాళ్లకు తీవ్ర జ్వరం, ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌.. అసలేం జరుగుతోంది?
ByTrinath

దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. పాపం దాయాది జట్టుకు ఏదీ కలిసి రావడంలేదు. వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్‌ 20న ఆస్ట్రేలియాతో పాకిస్థాన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మందు పాక్‌కు గట్టి షాక్‌ తగిలింది. పాక్‌ జట్టులో నలుగురు ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. షాహీన్ అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్ తీవ్ర జ్వరంతో పాటు ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని సమాచారం.

Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్‌ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్‌ చేయబోయే రికార్డు ఇదే..!
ByTrinath

అక్టోబర్ 19న పూణే వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ రన్ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 26వేల రన్స్ పూర్తవుతాయి. మరోవైపు పూణే గడ్డపై కోహ్లీకి అద్బుతమైన రికార్డులున్నాయి. ఈ పిచ్‌పై 12 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీలున్నాయి.

World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..!
ByTrinath

వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. అఫ్ఘాన్‌, పాకిస్థాన్‌పై అద్భుత ఆటతో తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్న రోహిత్‌కు..మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అక్టోబర్‌ 19న బంగ్లాదేశ్‌పై ఇండియా ఆడనుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ వంద కొడితే ఒకే జట్టుపై వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు

Advertisment
తాజా కథనాలు