author image

Trinath

BREAKING: టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ మృతి..!
ByTrinath

భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. దిగ్గజ స్పిన్నర్ 1967 -1979 మధ్య భారత్‌ తరపున 67 టెస్టులు ఆడి 266 వికెట్లు తీశాడు. 10 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు.

Rohit Sharma: రోహిత్ శర్మ వల్లే గెలుస్తున్నాం.. ఎందుకో తెలుసుకోండి..!
ByTrinath

ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇస్తున్న మెరుపు ఆరంభాలతో జట్టు విజయాల బాటపడుతోంది. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ వేగంగా పరుగులు చేస్తుండడంతో తర్వాత బ్యాటింగ్‌కి వస్తున్న ప్లేయర్లపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో వారు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసుకుంటూ జట్టును గెలిపిస్తున్నారు.

Virat Kohli: 'విరాట్‌.. ఇంత స్వార్థం పనికిరాదు..' ట్విట్టర్‌లో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
ByTrinath

న్యూజిలాండ్‌పై జరిగిన వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో కోహ్లీ ఆటతీరును పలువురు క్రికెట్ ఫ్యాన్స్‌ తప్పుపడుతున్నారు. సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్ విషయంలో కోహ్లీకి వ్యతిరేకంగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. అటు సెంచరీ కోసమే కోహ్లీ ఆడుతున్నాడంటూ గత రెండు మ్యాచ్‌లుగా అతనిపై విమర్శలు పెరుగుతున్నాయి. జట్టు గెలుస్తుందని తెలిసినప్పటికీ సెంచరీ కాలేదన్న బాధతో కోహ్లీ గట్టిగా అరుస్తూ గ్రౌండ్‌ని వీడడాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Dussehra: ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే..!
ByTrinath

తెలంగాణ వ్యాప్తంగా నిండు కుండల్లా చెరువులు, కుంటలు ఉన్నాయన్నారు మంత్రి హరీశ్‌రావు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించింది బీఆర్‌ఎస్‌ సర్కారేనన్నారు. విజయ దశమి ( దసరా ) పర్వదినం సందర్భంగా ప్రజలకు మంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎండాకాలాన్ని వానకాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.

IND vs NZ: 20ఏళ్ల నిరీక్షణకు తెర..అసలుసిసలైన టాపు, తోపు టీమిండియానే.. !
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. ఆరు వికెట్ల తేడాతో కివీస్‌ని మట్టికరిపించింది. 274 టార్గెట్‌ని భారత్ 48 ఓవర్లలో ఛేజ్ చేసింది. కోహ్లీ 104 బంతుల్లో 95 రన్స్ చేశాడు.

Lokesh: 'జ‌గ‌నాసుర ద‌హ‌నం'.. వాటిని ద‌హ‌నం చేయాలని లోకేశ్‌ పిలుపు..!
ByTrinath

జగన్‌కి వ్యతిరేకంగా టీడీపీ మరో వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రేపు(అక్టోబర్ 23) దసరా సందర్భంగా ‘దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం’అంటూ రేపు రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య మరో కార్యక్రమానికి పూనుకుంది . నాలుగున్నరేళ్లుగా అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు.

World Cup 2023: నాలుగు మ్యాచ్‌లు పక్కన పెట్టారు.. కసితీరా బౌలింగ్‌ చేసి అందరి నోళ్లు మూయించాడు!
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై జరిగిన పోరులో టీమిండియా స్పీడ్‌ స్టార్‌ మొహమ్మద్ షమీ అదరగొట్టాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. వన్డేల్లో ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. వన్డేల్లో షమీ ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన ప్లేయర్లలో షమీనే టాప్‌. షమి 5సార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు.

BREAKING: అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. నిలిచిపోయిన ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌..!
ByTrinath

ఈ ఫాగ్‌ ఎక్కడ నుంచి వచ్చిందిరా బాబు.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం స్టేడియాన్ని కమ్మేసింది. ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫాగ్‌ కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్‌ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ, శ్రేయర్‌ అయ్యర్‌ ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు