Arunachal Frontier Highway: చైనాకు భారత్ షాక్.. వద్దంటున్నా ఆ పని కానిచ్చేస్తోంది..

చైనా అభ్యంతరాలను పక్కన పెడుతూ భారత్ ఈశాన్య సరిహద్దుల్లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులు మొదలు పెడుతోంది. వీటిలో అత్యున్నత కష్టమైన, పెద్దదైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణానికి సన్నాహాలు మొదలు పెట్టింది భారత్. దీనికోసం రూ.6000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.  

Arunachal Frontier Highway: చైనాకు భారత్ షాక్.. వద్దంటున్నా ఆ పని కానిచ్చేస్తోంది..
New Update

Arunachal Frontier Highway: దేశ ఈశాన్య సరిహద్దులో చైనా జోక్యం పెరుగుతోంది. దానికి చెక్ పెట్టేందుకు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రోడ్డు కనెక్టివిటీకి సంబంధించింది. దేశంలోని అతిపెద్ద-అత్యంత కష్టతరమైన ప్రాజెక్టులలో ఒకటైన అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ 6000 కోట్ల రూపాయలను కూడా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. 11 రకాల ప్యాకేజీలకు ఈ కేటాయింపు జరిగింది. ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు, దానిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చైనా అభ్యంతరాలను పక్కన పెడుతూ ప్రాజెక్ట్(Arunachal Frontier Highway) పనులు మొదలు పెట్టేస్తోంది భారత్.  ఈ హైవే ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం గురించి భారత్ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. 

అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ అంటే..
చైనా సరిహద్దును దృష్టిలో ఉంచుకుని అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే(Arunachal Frontier Highway) నిర్మిస్తున్నారు. హైవే ప్రాజెక్ట్ పొడవు దాదాపు 1748 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన పనులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. LAC సరిహద్దు నుండి ఫ్రాంటియర్ హైవే దాదాపు 20 కిలోమీటర్లు వెళుతుంది. హైవే నుండి యాంగ్ట్సేకి దూరం కూడా చాలా ఎక్కువ కాదు. యాంగ్ట్సే ప్రాంతంలోనే భారత్, చైనాల మధ్య ఘర్షణ జరిగింది. హైవే పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల లోపు అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా దీనికి అనుసంధానిస్తారు.

మూడు ఏజెన్సీలకు బాధ్యతలు..
ఈ పనుల బాధ్యత మూడు ఏజెన్సీలకు అప్పగించినట్లు  రోడ్డు రవాణా శాఖ ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. ఈ మూడు ఏజెన్సీలు - రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అలాగే నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. మొత్తం ప్రాజెక్ట్ దశలవారీగా పూర్తి చేస్తారు.  ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మెగా ప్రాజెక్ట్‌కు(Arunachal Frontier Highway) సంబంధించిన 400 కి.మీ పనులు పూర్తవుతాయని అంచనా. దీంతో స్థానికులకు అనేక ఉద్యోగాలు లభిస్తాయి.

Also Read: మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే.. 

నితిన్ గడ్కరీ ఏం అన్నారంటే..
ప్రాజెక్ట్ రెండు ప్యాకేజీలకు కేటాయింపులను ప్రకటించిన రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఈ రహదారి వ్యూహాత్మక అభివృద్ధి లక్ష్యం ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచడం అని చెప్పారు. ఈ రహదారి (Arunachal Frontier Highway)నిర్మాణం తరువాత, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామాల నుండి ప్రజల వలసలు తగ్గుతాయి. సరిహద్దులో మన బలగాల చేరువ.. అప్రమత్తత కూడా పెరుగుతుంది.

Watch this Interesting Video:

#china #arunachal-pradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe