ఇవాళ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగనుంది. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపైవ ఇచారణ జరుగనుంది. సీఐడీ వీటికి కౌంటర్లు దాఖలు చేయనుంది. అలాగే చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీకోర్టులో విచారణ జరుగనుంది. ఇదిలాఉంటే.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది సీఐడీ. ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబును పేరును చేరుస్తూ మెమో దాఖలు చేసింది. ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా ఈ మెమో దాఖలు చేయనున్నారు సిఐడీ అధికారులు.
-
Sep 20, 2023 13:18 ISTఅంగళ్లు అల్లర్ల కేసులో బాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
అన్నమయ్య జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా, అంగళ్లు ఘటనలో చంద్రబాబు ఏ-1 గా ఉన్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆంగళ్లులో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల లిస్ట్‌లో చంద్రబాబును కూడా చేర్చారు. ఈ కేసులోను ఆయన అరెస్ట్ కోసం పిటి వారెంట్ జారీ చేశారు పోలీసులు. అయితే, ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తరఫున లాయర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
-
Sep 20, 2023 12:57 ISTఅసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభా పక్షం నిర్ణయం..
రేపటి నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా.. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామంటూ నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, ప్రజా సమస్యలపై చట్ట సభల వేదికను వదులుకోకూడదని నిర్ణయించారు. సభలో పోరాటం చేద్దాం.. వీధుల్లోనూ పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు డిసైడ్ అయ్యారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే.. నిరసన ద్వారా సాధిద్దాం అని అన్నారు. మొత్తంగా చంద్రబాబుకు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నేతలు. కాగా, నారా లోకేష్ ఈ సమావేశానికి జూమ్ ద్వారా హాజరయ్యారు.
-
Sep 20, 2023 11:49 ISTఅంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇప్పటికే 14 రోజుల రిమాండ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడిని ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లు ఘర్షణల కేసులో చంద్రబాబుపై పీటీ వారెంట్ జారీ చేసిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు ఆయన తరఫున లాయర్స్. ఇప్పటికే స్కిల్ డెవపల్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.
-
Sep 20, 2023 11:48 ISTటీడీపీ శాసనసభా పక్షం భేటీ..
అమరావతిలో మరికాసేపట్లో టీడీపీ శాసనసభా పక్షం సమావేశం జరుగనుంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు, పొలిటి బ్యూరో సభ్యులు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, బోండా ఉమ తదితరులు పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేలు అచ్చెనాయుడు, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయస్వామి, గద్దె రామ్మోహాన్, రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు కూడా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా? వద్దా? అనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలపైనా చర్చించనున్నారు.
-
Sep 20, 2023 11:46 ISTఇంతకు ముందు ఎప్పుడూ ఓబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదేమి అని కౌంటర్ ఎటాక్ ఇచ్చిన బీజెపీ
-
Sep 20, 2023 11:39 ISTఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్..
చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారించనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ సమర్పించింది సీఐడీ. వాదనల అనంతరం న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపోతే.. పిటిషన్లను పరిశీలించిన ధర్మాసనం.. ముందుగా సీఐడీ కస్టడీ పిటిషన్‌ను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అనంతరం బెయిల్ పిటిషన్‌ను విచారిస్తామంది.
-
Sep 20, 2023 11:26 ISTమహిళా బిల్లుపై లోక్ సభలో మొదలైన చర్చ, మాట్లాడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
-
Sep 19, 2023 17:19 ISTబెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
. రెండు రోజుల్లో తీర్పు వెల్లడిస్తామన్న న్యాయస్థానం
-
Sep 19, 2023 16:58 ISTసీఐడీ తరపు న్యాయవాదులకు హైకోర్టు అల్టిమేటం
మీరు ఏమైనా వాదనలు వినిపించాలంటే ఇవాళే వినిపించండి. క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఈరోజే ఇచ్చేస్తాం.
-
Sep 19, 2023 16:42 ISTకౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరిన సీఐడీ లాయర్
. కౌంటర్ వేయడానికి వచ్చే శుక్రవారం వరకు... సమయం కావాలని హైకోర్టు కోరిన సీఐడీ తరపు లాయర్ . సీఐడీ తరపు వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి -హరీష్ సాల్వే . 2018లోనే విచారణ ప్రారంభమైందని చెబుతున్నారు.. ఇప్పుడేమో ఇంకా ప్రాథమిక దశలోనే ఉందంటున్నారు -హరీష్ సాల్వే
-
Sep 19, 2023 16:01 ISTప్రభుత్వ తరపున న్యాయవాదికి హైకోర్టు బెంచ్ ప్రశ్నలు
. సబ్ కాంట్రాక్టర్లను ఎవరు నియమించారు
. సబ్ కాంట్రాక్టర్ల నియామకంలో… చంద్రబాబు పాత్ర ఏంటని హైకోర్టు ప్రశ్న
-
Sep 19, 2023 16:01 ISTప్రభుత్వం తరపున రంజిత్ కుమార్ వాదనలు
. ఇదే కేసులో చంద్రబాబుకు ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది
. ఒప్పందంలో తేదీనే లేదు
. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరిగింది-
. డిజైన్ టెక్ రూ.200 కోట్లను మళ్లించింది
-
Sep 19, 2023 16:00 ISTసీఐడీ తరపున సీఆర్పీసీ 17A పైన వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహిత్గీ
. గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుతో పాటు చంబునాథ్ మిశ్రా కేసులో తీర్పుల్ని వివరిస్తున్న ముకుల్
. అన్ని సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారు..
. ఈ దశలో బెయిల్ ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదు..
. ఎఫ్‌ఐఆర్ ఏమి ఎన్‌సైక్లోపిడియా కాదు..
. స్కిల్ స్కాంకు ఒప్పందానికి కేబినెట్ ఆమోదం లేదు.
. సెక్షన్ 139 ప్రకారం ఎన్ని ఛార్జ్‌షీట్‌లైనా వేయవచ్చు.
. ఎఫ్‌ఐఆర్‌లో ఎంత మంది పేర్లను అయినా చేర్చవచ్చు.
-
Sep 19, 2023 15:01 ISTఅరెస్ట్ చేసేటప్పడు ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు: హరీశ్ సాల్వే
. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేదు.
. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‌మాల్ చౌదరి, అర్ణబ్ గోస్వామి కేసులను ప్రస్తావించిన సాల్వే
. ఎన్నికల దృష్ట్యా దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదుచేశారు
. సెక్షన్ 17ఏ కింద అనుమతులు తీసుకోలేదు
. గత జడ్జిమెంట్లను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారు
. 2020లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు ఎలా అరెస్టు చేస్తారు?
. అరెస్ట్ విషయంలో సీఐడీ ప్రొసీజర్ పాటించలేదు
చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు..
. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి
. FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే బెయిల్ అడిగేవాళ్లం కాదు
. FIR 2020లో నమోదైంది కాబట్టి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి
. అవినీతి నిరోధక చట్టం క్రింద ప్రజాప్రతినిధిపై కేసు నమోదు చేసే సమయంలో గవర్నర్ అనుమతి తప్పనిసరి
. 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగింది
. కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని లూథ్రా వాదన
-
Sep 19, 2023 14:53 ISTఅమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
. అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాదులు
. శుక్రవారానికి విచారణను వాయిదా వేసిన హైకోర్టు
-
Sep 19, 2023 14:52 ISTక్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, ఎఫ్‌ఐఆర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు జరగుతున్నాయి.
-
Sep 19, 2023 14:40 IST