ల్యాండ్‌ లోన్‌ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోస పోవడం ఖాయం!

ప్రస్తుతం ప్రజలు ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువ మంది ప్రజలు బ్యాంకులను సంప్రదిస్తున్నారు.ల్యాండ్‌ లోన్‌ తీసుకునే ఆలోచనలో ఉంటే మాత్రం తప్పకుండా ఈ విషయాలు గురించి మాత్రం తెలుసుకోండి.అవేంటో ఇప్పుడు చూద్దాం.

ల్యాండ్‌ లోన్‌ తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోస పోవడం ఖాయం!
New Update

ప్రస్తుతం ప్రజలు ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఎక్కువ మంది ప్రజలు బ్యాంకులను సంప్రదిస్తున్నారు. చాల రకాల లోన్‌ ఆప్షన్లు, తక్కువ వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్‌ ప్రాసెస్‌లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. క్రెడిట్ ప్రొఫైల్, అవసరమైన లోన్ రకం ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి. అందుబాటులో ఉన్న పాపులర్‌ లోన్‌ ఆప్షన్‌లలో ల్యాండ్ లోన్ లేదా ప్లాట్ లోన్ ఒకటి. ఈ లోన్‌ భూ యజమానులకు గణనీయమైన ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తుంది. వివిధ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీరూ ల్యాండ్‌ లోన్‌ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ముందుగా తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏవో చూద్దాం.

వ్యాపార విస్తరణ, ఇంటి నిర్మాణం, డెట్‌ కన్సాలిడేషన్‌ లేదా వ్యక్తిగత ఖర్చుల కోసం సాధారణంగా ప్లాట్‌పై లోన్‌ తీసుకుంటుంటారు. ఈ లోన్‌కు అర్హత పొందాలంటే, రుణగ్రహీత తప్పనిసరిగా స్పష్టమైన, మార్కెట్ చేయదగిన టైటిల్ డీడ్‌తో ప్లాట్‌కు చట్టపరమైన యజమాని అయి ఉండాలి. బ్యాంకులు ప్లాట్ లొకేషన్‌, విలువ, రుణగ్రహీత క్రెడిట్ వర్తీనెస్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో ఓనర్‌షిప్‌ ప్రూఫ్‌, ల్యాండ్‌ డాక్యుమెంట్స్, ఐడెంటిటీ ప్రూఫ్‌, అడ్రస్‌ ప్రూఫ్‌, ఇన్‌కమ్‌ డాక్యుమెంట్స్ (శాలరీ స్లిప్‌లు లేదా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ వంటివి), బ్యాంక్ స్టేట్‌మెంట్‌ అందజేయాల్సి ఉంటుంది. లోన్ అప్రూవల్‌ ప్రాసెస్‌ సాఫీగా సాగాలంటే డాక్యుమెంట్లు అన్నీ సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మార్కెట్ పరిస్థితులు, బ్యాంకు పాలసీల ఆధారంగా ఫిక్స్‌డ్‌ లేదా ఫ్లోటింగ్‌ ఇంట్రస్ట్‌ ఆప్షన్‌ ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లు పొందేందుకు అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లను పోల్చి చూడాలి. అదనంగా రుణగ్రహీతలు ప్రాసెసింగ్ ఫీజులు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, ప్రీ పేమెంట్‌ పెనాల్టీల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.మంజూరు చేసే లోన్‌ అమౌంట్‌ అనేది మొత్తం ప్లాట్ విలువ, లొకేషన్‌, రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, బ్యాంకులు ప్లాట్ మార్కెట్ విలువలో ఒక శాతం వరకు లోన్‌గా అందిస్తారు. లోన్‌ టెన్యూర్‌ కొన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల వరకు మారవచ్చు. టెన్యూర్‌ ఎంపిక రీపేమెంట్‌లో సౌలభ్యాన్ని అందిస్తుంది.

లోన్‌ అప్రూవ్‌ అయిన తర్వాత రుణగ్రహీత అవసరాల ఆధారంగా మంజూరైన మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో బ్యాంకులు అందజేస్తాయి. స్పెసిఫిక్‌ పర్పస్‌ లోన్‌ల మాదిరిగా కాకుండా ల్యాండ్‌ లేదా ప్లాట్‌ లోన్‌ అమౌంట్‌ని ఏ అవసరాలకు అయినా ఉపయోగించుకోవచ్చు.పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణ వంటి ప్రయోజనాల కోసం ఫండ్స్‌ పొందడంలో సహాయపడుతుంది. అలానే కఠినమైన పరిమితులు లేకుండా విభిన్న ఆర్థిక అవసరాలకు లోన్‌ అమౌంట్‌ ఉపయోగించుకోవచ్చు. రుణగ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి, అన్‌సెక్యూర్డ్‌ లోన్‌లతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ప్లాట్లపై లోన్‌లకు రీపేమెంట్‌ గడువు ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈఎంఐల భారం తక్కువగా ఉంటుంది.

ప్లాట్లపై రుణాలు ఆర్థిక సౌలభ్యాన్ని అందిస్తున్నప్పటికీ, రుణగ్రహీతలు తప్పనిసరిగా కొన్ని రిస్కులను అంచనా వేయాలి. భూమి విలువలో హెచ్చుతగ్గులు, ఆర్థిక పరిస్థితులు, ప్లాట్ మదింపు, రుణాన్ని తిరిగి చెల్లించే రుణగ్రహీత సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. లోన్‌ పేమెంట్‌పై డిఫాల్ట్ చేయడం వలన బ్యాంకులు ప్లాట్‌ను జప్తు చేయడం, వేలం వేయడం వంటి చట్టపరమైన పరిమాణాలకు దారి తీయవచ్చు.

#bank-loans #home-loan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి