Bedroom Mirror: బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త

ఇంట్లోని కొన్ని వస్తువులు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తాయని నమ్ముతారు. బెడ్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని, అద్దం పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటే ఏం జరిగిదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి

Bedroom Mirror: బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త
New Update

Bedroom Mirror: మామూలుగా అయితే ఇంటి నిర్మాణం విషయంలో వాస్తును ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంటీరియ‌ర్ డిజైన్‌లోపూ వాస్తు పాటిస్తే ఆ ఇంట్లో సానుకూల‌త ఉంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అయితే బెడ్‌రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలని, అద్దం పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

publive-image

సాధారణంగా ఇంట్లోని కొన్ని వస్తువులు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా ఇస్తాయని నమ్ముతారు. కాకపోతే ఆ వస్తువులను పెట్టరాని చోట పెడితే అరిష్టం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బెడ్‌రూమ్‌లో అద్దం పెట్టడం అస్సలు మంచిది కాదని, మరీ ముఖ్యంగా అద్దంలో బెడ్‌ కనిపించకూడదని చెబుతున్నారు. అలా ఉంటే నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని, దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

publive-image

దాంపత్యంలో మూడో వ్యక్తి రావడం, జీవితం అస్థవ్యస్థంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బెడ్‌రూమ్‌లో అస్సలు అద్దం ఉంచకూడదని చెబుతున్నారు. అంతేకాకుండా బెడ్‌రూమ్‌లో టీవీని ఉంచడం కూడా మంచిదికాదని చెబుతున్నారు. అద్దాన్ని ఇతర గదిలోకి మార్చడం మంచిదని సలహా ఇస్తున్నారు. లేదంటే దాని మీద ఒక కటన్‌ను వేసి కనిపించకుండా చేయాలని, ఇలా చేస్తే దాంపత్య జీవితం బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. బెడ్‌రూమ్‌ను కూడా ఎప్పటికప్పుడు సర్దుకుని నీట్‌గా పెట్టుకోవాలని, ఉదయం లేవగానే దుప్పట్లను మడతపెట్టాలని, బట్టలు కూడా చిందరవందరగా పడేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో బీరువా ఇటు పెడితే ఉన్న డబ్బంతా పోతుంది

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#bedroom-mirror
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe