Araku Crime: అమ్మ దగ్గర పాలు తాగడం తప్ప మరోటి చేతకాని పసిపిల్ల. తల్లి ఒడిలో కూచుని.. కళ్ళముందే అమ్మ చచ్చిపోయినా అర్ధం కాని చిన్నారి. పొదల మధ్యలో రెండురోజుల పాటు చనిపోయిన అమ్మఒడిలోనే ఆకలితో అలమటించిన ఏడాది పాప. ఈ వాక్యాలు చదువుతుంటూనే మనసు వికలం అయిపోతోంది కదూ. అవును.. అందరి మనసుల్నీ కదిలించేసిన ఘటన ఇది. అరకు దగ్గరలోని అనంతగిరి మండలంలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Araku Crime: అనంతగిరి మండలం కోనాపురం గ్రామానికి చెందిన పాంగి పద్మకు.. అరకులోయ మండలం పద్మాపురం గ్రామానికి చెందిన కొండాతో వివాహం అయింది. వీరికి ఇద్దరు బిడ్డలున్నారు. రెండో బిడ్డకు ఏడాది వయసు. గురువారం ఇంటిలో చిన్న గొడవ జరిగింది. ఆ తరువాత పాని రంగానీ గ్రామంలో పద్మ తన పెదనాన్న కూతురు ఇంటికి వెళ్ళింది. ఉదయం ఆ ఇంటివారితో కలిసి భోజనం చేసింది. తరువాత ఆ ఇంటివారంతా పొలం పనులు కోసం బయటకు వెళ్లారు. పనుల తరువాత ఇంటికి వచ్చిన వారికి పద్మ కనిపించలేదు. అయితే, తిరిగి ఇంటికి వెళ్లిపోయిందేమో అని వారు పట్టించుకోలేదు. అయితే, మూడోరోజు ఆ గ్రామంలో ఏడాది వయసున్న పాప రోడ్డుపై కొందరికి కనిపించింది. వారు ఆ పాప ఎవరనే విషయం ఆరా తీయగా పాంగి పద్మ బిడ్డ అని తెలిసింది. దీంతో అందరూ కలిసి పాప తల్లికోసం అక్కడ వెతిగారు. ఈ క్రమంలో అక్కడికి కొంచెం దూరంలోని పొదల్లో పద్మ ఉరివేసుకుని విగతజీవిగా పడి ఉండడం కనిపించింది. అంటే, రెండురోజుల క్రితం ఆమె అక్కడ బిడ్డను ఒడిలో ఉంచుకుని ఉరివేసుకుని చనిపోయింది. పాప రెండురోజుల పాటు మరణించిన తల్లి ఒడిలో ఉంది. మొత్తానికి తల్లి తనకు కట్టిన గుడ్డనుంచి ఆ చిన్నారి తప్పించుకుని బయటపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రెండురోజుల పాటు పాప తల్లి షవంతో ఉండిపోవడం తలుచుతుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదూ.
మతిస్థిమితం లేని తల్లి..
Araku Crime: గ్రామస్తులు వెంటనే విషయాన్ని అరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి బిడ్డను స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పచెప్పారు. పద్మ భర్త తనకు తానుగా పోసీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. విచారణలో.. తనకు ఏమీ తెలియదనీ, తన భార్య కనిపించకపోవడంతో చాలా చోట్ల వెతికానని అతను చెప్పాడు. పోలీసుల దర్యాప్తులో పద్మకు మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. ఆమె తరుచుగా ఇంటిలో గొడవ చేసేదని. ఇంట్లో మద్యం తాగి అల్లరిగా ప్రవర్తించేదని ఇరుగుపొరుగు చెప్పారు. పిల్లల్ని సరిగా చొసేది కాదని, చిన్న పాపను కూడా విసుగుకుంటూ ఉండేదనీ వారు పోలీసులకు చెప్పారు. ఘటన జరగడానికి ముందురవుజు కూడా పద్మ ఇరుగు పొరుగు ఇళ్లలో దూరి చాలా అల్లరి చేసిందని తెలిపారు.
సంఘటన పై పూర్తి దర్యాప్తు చేసిన పోలీసులు ఇది మతిస్థిమితం లేక పద్మ చేసుకున్న ఆత్మహత్యగా భావించి ఆమె భర్తను విడిచిపెట్టారు. కాగా స్త్రీ - శిశు సంక్షేమ శాఖ అప్పగించిన పాపను ఆమె తాత పద్మాపురం తీసుకొని పోయి తానే పెంచుకుంటావని తెలిపారు.
Also Read : ఏపీలో ఫుడ్ పాయిజన్ కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి!