Anita: మేము తలచుకుంటే వాళ్లు రోడ్ల మీదకు రాలేరు.. RTVతో హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు!

అవమానం జరిగిన చోటే తాను తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నానని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి వనిత అన్నారు. తనను వైసీపీ అక్రమ కేసులు పెట్టి వేధించిందని, ఇప్పుడు తాము తలచుకుంటే వాళ్లు రోడ్డుమీదకు రాలేరంటూ RTVతో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Anita: మేము తలచుకుంటే వాళ్లు రోడ్ల మీదకు రాలేరు.. RTVతో హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు!
New Update

AP News: ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే తాను తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నాని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి వనిత అన్నారు. విధి చాలా విచిత్రమైనదని, ఏ పోలీసులైతే అరెస్టు చేసి తీసుకొని వెళ్లే వారో అదే పోలీసులు ఇప్పుడు భద్రతతో తనను తీసుకెళ్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 19న హోం మంత్రి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఆమె RTVతో మాట్లాడారు.

వాటిపై ఉక్కు పాదం మోపుతాం..
'నాపై చాలా కేసులు ఉన్నాయి. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముసుగు వేసుకొని తిరిగిన రోజులున్నాయి. నేను మొదటగా టీచర్. ఆ స్థాయిని ఎప్పటికీ మర్చిపోను. జూన్ 19న పూర్తిస్థాయిలో భద్రతలు చేపడతాను. చంద్రబాబు గతంలో పోలిసులకు ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఉండాలి. గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం. వాళ్లే గిల్లి వాళ్లే ఏడ్చినట్టు ఉంది ఇప్పుడు వైసీపీ పరిస్థితి. వాళ్లకు వాళ్లే దాడులు చేసుకొని మేము చేసామని చెప్తున్నారు. మా వాళ్లను కొట్టి కేసులు పెట్టి ఆరోజు ఆనందించారు. నిజంగా వాళ్లలాగే మేము అగ్రిసీవ్ గా ఉంటే వైసీపీ వాళ్ళు రోడ్లమీద తిరిగేవారా? అని ప్రశ్నించారు. అలాగే 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఇప్పుడెందుకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని ఎదురు ప్రశ్నలు సంధించారు.

మహిళలకు అన్యాయం జరిగితే తాటతీస్తాం
ఇక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అన్యాయం జరిగిన కఠినంగా వ్యవహరిస్తామని ఆమె హెచ్చరించారు. దిశ చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందని, మహిళల కిడ్నాప్ కేసులలో దర్యాప్తు వేగవంతం చేస్తామని చెప్పారు. శాంతి భద్రతలు గతంలో కన్నా మెరుగు పరుస్తామని అన్నారు. అధికారులు నిబంధనలకు లోబడి పని చేయాలని ఎటువంటి సిఫార్సులకు లొంగవద్దని హితవు పలికారు.

#vangalapudi-vanitha #ycp #ap-home-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి