ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేయడానికి మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నాడని హోం మంత్రి అనిత ఆరోపించారు. ఈ రోజు మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యల జరిగాయని అని జగన్ అంటున్నాడన్నారు. ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉంటే ఆ డేటా ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు. చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాన్ని నిరూపించలేకపోతే జగన్ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు. వినుకొండలో వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యను డైవర్ట్ చేసి రాజకీయాలకు అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు. వినుకొండ లో పరామర్శించడానికి వెళ్లి అక్కడ రాజకీయాలు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. జగన్ కు సీఎం కుర్చీ పై వ్యామోహం ఇంకా తగ్గలేదన్నారు. ఎలాగైనా అడ్డదారిలో పీఠం ఎక్కాలని తహతలాడుతున్నాడని ఫైర్ అయ్యారు. అందుకే వినుకొండ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Jagan: నేడు గవర్నర్‌తో భేటీ కానున్న మాజీ సీఎం జగన్
ఐదేళ్లలో జగన్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశాడని ధ్వజమెత్తారు. అందుకే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వంలో ఎంతో మంది టీడీపీ, జనసేన లీడర్లను జగన్ అనేక ఇబ్బందులు పెట్టాడన్నారు. అసలు రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలు నాలుగేనని.. అందులోనూ చనిపోయిన ముగ్గురు టీడీపీ వాళ్లే ఉన్నారన్నారు. చేసిందంతా చేసి మళ్ళీ ఈరోజు గవర్నర్ దగ్గరకు వెళ్తున్నాడని నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లలో టీడీపీ పై మీరు చేసిన దాడులకు మేము ఎవరి దగ్గరకి వెళ్లాలని ప్రశ్నించారు. గంజాయి, మైనర్ బాలికల పై హత్యాచారాలపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశావా? అని జగన్ ను ప్రశ్నించారు. నువ్వు ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ రూల్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్లు ఒక కారును కేటాయించారని అనిత స్పష్టం చేశారు. కానీ ఆ కారు వద్దు అని వేరే ప్రవేట్ కారెక్కాడని ఫైర్ అయ్యారు.
నిజంగా రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతుందని అనుకుంటే.. దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్.. అంటూ సవాల్ విసిరారు. జగన్ అయినా, వేరే ఎవరు అయినా ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనకాడమని తేల్చి చెప్పారు. ఐదేళ్లలో గంజాయిని రాష్ట్ర పంటగా మార్చేశారని వైసీపీపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు వాటన్నిటినీ ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు