Postal Ballot Votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 6 గంటలకు ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బ్యాలెట్ ఓటు విషయంలో సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సీఈసీ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని వైసీపీ తరఫు లాయర్లు యహమా వాదనలు వినిపించారు. చెల్లని ఓట్లు కూడా పరిగణలోకి తీసుకోవాలనే విధంగా ఉన్నాయని కోర్టుకు వారు తెలియజేశారు.
సీఈసీ ఇచ్చిన ఆదేశాలను వెంటనే నిలిపివేయాలని వైసీపీ లాయర్స్ కోరారు. మరోవైపు ఈసీ తరఫు లాయర్లు కూడా తమ వాదనలు వినిపించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద బ్యాలెట్ ఓటు ఉపయోగించుకున్న వారికి మాత్రమే ఈసీ ఉత్తర్వులు వర్తిస్తాయని న్యాయమూర్తికి ఈసీ తరఫు లాయర్స్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును సాయంత్రం 6 గంటలకు వెల్లడిస్తామని ప్రకటించింది.