CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ విడుదల చేయాల్సిన శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల వాయిదా వేశారు. మిగిలిన మూడు శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేత పత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖ, భూదందాలు, సహజవనరుల దోపిడీపై శ్వేతపత్రాలు విడుదల చేసింది రాష్ట్ర సర్కార్.
గత ప్రభుత్వంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
చంద్రబాబు మాట్లాడుతూ.. వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఏ శాఖ చూసిన తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. తవ్వినకొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని అన్నారు. విద్యుత్‌తో.. ప్రతి ఒక్కరి జీవతం ముడిపడి ఉందని చెప్పారు. విద్యుత్‌తోనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చే సరికి విద్యుత్ కొరత ఉందని తెలిపారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం అని అన్నారు. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారని తెలిపారు.