YSRCP: ఆ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తేనే.. నేను ఎంపీగా పోటీ చేస్తా: వైసీపీలో కొత్త పంచాయితీ

నెల్లూరు సిటీ, ఉదయగిరి, కావాలి అభ్యర్థులను మారిస్తేనే తాను నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తానని వేమూరి ప్రభాకర్ రెడ్డి వైసీపీ హైకమాండ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశం జిల్లా పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది.

YSRCP: ఆ ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తేనే.. నేను ఎంపీగా పోటీ చేస్తా: వైసీపీలో కొత్త పంచాయితీ
New Update

ఏపీలో ఎన్నికల (AP Elections 2023) వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రారంభించాయి. అధికార వైసీపీ.. అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తూ.. కొత్తగా ఇంన్ఛార్జిలను నియమిస్తూ ఎలక్షన్స్ హడావుడిని మొదట స్టార్ చేసింది. అయితే.. గతేడాది 100 శాతం ఫలితాలను అందించిన నెల్లూరు జిల్లా వైసీపీలో అనేక కొత్త పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీచేయనున్నారు. ఇప్పటికే ఆయనే అభ్యర్థిగా ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. అయితే ఆయన జిల్లాలో మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలని హైకమాండ్ ను పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరిలో అభ్యర్థులను మార్చి తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వకుంటే తాను ఎంపీగా పోటీ చేయనని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురిని మార్చుకుంటే నేను పోటీ చేయనని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెగేసి చెప్పినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP Elections 2024: టికెట్ విషయంలో నా ఆలోచన అదే.. వైసీపీ ఎంపీ మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు

  • నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయి రూప్ కుమార్ యాదవ్ మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సీఎం చెప్పినా వీరి మధ్య పరిస్థితి చక్కబడలేదు. దీంతో పాటు, అనిల్ కుమార్ కు వ్యతిరేకంగా మరి కొందరు వైసిపి నేతలు మాట్లాడుతున్నారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డి ప్రతాప్ కుమారెడ్డి, సుకుమార్ రెడ్డి మధ్య విభేదాలు ఇదే తీరుగా కొనసాగుతున్నాయి.
  • ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డితో.. ఐదుగురు నియోజవర్గ నేతలు కత్తులు దూస్తున్నారు. పార్టీ పెద్దలు నచ్చచెప్పినా అక్కడ పరిస్థితి మారడం లేదు. ఈ మూడు నియోజవర్గాల్లో సీఎం తోపాటు విజయసాయిరెడ్డి మరి కొందరు పెద్దలు స్థానిక నేతలతో మాట్లాడి రాజీచేసే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారన్న ప్రచారం ఉంది.ఈ నేపథ్యంలో తాను ఎంపీగా పోటీ చేయాలంటే ఈ మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అయితే.. హైకమాండ్ పెద్దల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు వేమిరెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏంటన్న అంశంపై నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలోని వెంకటగిరి, నెల్లూరు రూరల్, ఉదయగిరి ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిపోయిన విషయం తెలిసిందే.

జనవరి 2న సీఎంతో భేటీ!
జనవరి 2న తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం జిల్లా నేతలకు ఏం చెబుతారు? ఎలాంటి సూచనలు చేస్తారు? ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారు? అన్నది ఉత్కంఠగా మారింది.

#ap-cm-jagan #ysrcp #nellore-district
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి