AP Elections 2024: ఏపీలో ఎన్నికలకు పోలింగ్ జోరుగా సాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొంటున్నారు. మరోవైపు చాలా ప్రాంతాలల్లో పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదాలు.. ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
పూర్తిగా చదవండి..కర్నూలు జిల్లాలో..
AP Elections 2024: కర్నూలు జిల్లా బేతంచర్లలో వైసీపీ అనుచరులు ఇండిపెండెంట్ అభ్యర్థిపై దాడి చేశారు. స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబుపై మంత్రి బుగ్గన అనుచరుల దాడితో పరిస్థితి గందరగోళంగా మారింది. వైసీపీ అనుచరులు పీఎన్ బాబు కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఆయన చేసిన తప్పు బుగ్గన కారు వెనుక వెళ్లడమే. తమ వెనుక రావద్దంటూ బుగ్గన అనుచరులు వీరంగం సృష్టించారు. పీఎన్ బాబు కారుపై దాడి చేయడమే కాకుండా తిట్ల దండకం అందుకున్నారు. ఈ ఘటనపై బేతంచర్ల పోలీసులకు పీఎన్ బాబు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లా చేజర్లలో హై టెన్షన్ నెలకొంది. జడ్పీ స్కూల్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పరం కొట్టుకున్నాయి. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది. పోలింగ్ బూత్ లోకి వెళ్లే క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
కృష్ణాజిల్లాలో..
ఇక కృష్ణాజిల్లాలో వైసీపీ నాయకులూ రాళ్లదాడి దిగారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని బృందంపై రాళ్ల దాడి చేశారు. ఆయన కారును వెంబడిస్తూ రాళ్ళూ విసిరారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషణలకు దిగారు. ఇంత అల్లరి జరుగుతున్నా అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
అన్నమయ్య జిల్లాలో..
రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట దలవాయిపల్లి పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ రోడ్డుపై గ్రామస్తులతో కలిసి జనసేన నేత బత్యాల బైఠాయించారు. వైసీపీ నాయకులు కొల్లం గంగిరెడ్డిని, బాబుల్ రెడ్డిని అరెస్ట్ చేసేంతవరకు ఎన్నికల జరపకూడదని రిటర్నింగ్ అధికారిని కోరారు జనసేన నాయకులు. ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ ఎలా నిర్వహిస్తారని రిటర్నింగ్ అధికారిని బత్యాల నిలదీశారు. పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
జనసేన ఏజంట్లనే కొట్టి ,ఈవీఎంలు పగలకొట్టిన వారిని అరెస్ట్ చేయకుండా జనసేన ఏజంట్లనే స్టేషన్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్నికల అబ్సర్వర్ కు పుల్లంపేట మండలంలో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేశారు.
[vuukle]