Salaar 2 : 'సలార్- 2' లో మరో పాన్ ఇండియా హీరో.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న ప్రశాంత్ నీల్?

సలార్' పార్ట్-2 లో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపించబోతున్నట్లు సమాచారం. పార్ట్-2 క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అదే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీకి ఆరంభం అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

Salaar 2 : 'సలార్- 2' లో మరో పాన్ ఇండియా హీరో.. ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయనున్న ప్రశాంత్ నీల్?
New Update

Junior NTR In Salaar 2 : పాన్ ఇండియా హీరో ప్రభాస్ - కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన 'సలార్' పార్ట్-1 గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 700 కోట్ల వసూళ్లు రాబట్టి ప్రభాస్ కి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.

సినిమాలోని యాక్షన్ సీన్స్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. 'సలార్' పార్ట్-1 హిట్ అవ్వడంతో అప్పుడే పార్ట్-2 పై అంచనాలు పెరిగిపోయాయి. ఇక పార్ట్-2 కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఆ అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది.

'సలార్ 2' లో ఎన్టీఆర్

'సలార్' పార్ట్-2 'శౌర్యంగ పర్వం' అనే టైటిల్ తో రాబోతుంది. మే చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే ప్రభాస్ సైతం షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం కనిపించబోతున్నట్లు సమాచారం. 'సలార్' పార్ట్-2 క్లైమాక్స్ లో వచ్చే ఓ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని, అదే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీకి ఆరంభం అని అంటున్నారు. అంటే 'సలార్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే అని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ మీడియా సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read : గోపీచంద్ హీరోయిన్ 4 సార్లు అబార్షన్ చేయించుకుందా? సంచలన విషయాలు బయటపెట్టిన భావన!

ఒకవేళ ఇదే నిజమైతే ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, విలన్ రోల్స్ చేస్తున్నారు. ఈశ్వరీ రావ్, బాబీ సింహా, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమా 2025 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

#prabhas #jr-ntr #salaar-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి