Nagababu: తననీ రాజ్యసభకు పంపేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై నాగబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది రాష్ట్ర అభివృద్ధి కోసమే అని.. తన స్వార్థం కోసం కాదని అన్నారు. తనకు రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచన లేదని.. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే పనిచేయడమే తన అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. తనను రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై నాగబాబు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు
స్వార్థ ప్రయోజనాల కోసం కాదు...
నాగబాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. " అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు,అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే, వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే వుంటాడు . అతను ఎప్పుడు సత్యానికి,ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన ఉద్దేశ్యము స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాలకోసం.
(అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప.. నాకు రాజకీయ ఆశయం లేదు)." అంటూ జనసేన పార్టీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్