YSRCP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి కోలుకుంటున్న జగన్ కు.. సొంత పార్టీ నేతల రాజీనామాలు, చెల్లితో ఆస్థి వివాదం, అదానీ లంచం ఇచ్చినట్లు వచ్చిన వార్తలతో ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. కైకలూరుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు.
సైకిల్ ఎక్కనున్నారు...
అధికారం కోల్పోయిన పార్టీకి నేతలు రాజీనామా చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా అదే బాటలో ఉన్నారు. గతంలో టీడీపీ లో ఉన్న ఆయన.. ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉండటంతో సైకిల్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆ తరువాత వైసీపీ అధినేత జగన్ కు కలిసి ఆ పార్టీలో చేరారు. అయితే.. పార్టీలో చేరిన వెంకటరమణకు కీలక పదవి ఇవ్వాలని భావించిన జగన్..
ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెండంతో ఆయన పార్టీకి, అధిష్టానానికి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆ ఆయన తిరిగి అధికారంలో ఉన్న టీడీపీలో చేరనున్నట్లు అక్కడి రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.