తిరుమలలో ఈ 5 మిస్టేక్స్ చేస్తే మహా పాపం.. పండితులు ఏం చెబుతున్నారంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. అయితే కొందరు భక్తులు స్వామి వారిని దర్శించుకునే క్రమంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేస్తే స్వామి వారి అనుగ్రహం లభించదని పండితులు చెబుతున్నారు.

author-image
By Bhavana
TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా!
New Update

Tirumala : తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ...ఆ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే స్వామి వారిని దర్శించుకోవడానికి ముందు వరాహ స్వామిని దర్శించుకోవాలని...ఆ తరువాతే వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే.. తిరుమలను ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు భూదేవిని రక్షించి ఇక్కడే కొలువైనట్లు ప్రశస్తి.

విష్ణుమూర్తి వైకుంఠాన్ని వీడి వేంకటేశ్వరుడిగా అవతరించిన తర్వాత తిరుమల కొండపై ఉండేందుకు తనకు వంద అడుగుల స్థలాన్ని ఇవ్వాల్సిందిగా వరాహమూర్తిని కోరగా అందుకు ఆయన అంగీకరించి.. ఆ పై ప్రథమ దర్శనం, పూజ, నైవేద్యం తనకే జరగాలని కోరుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఇందుకు శ్రీనివాసుడు అంగీకరించి అక్కడ కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల అర్చక స్వాములు మొదటి కోరికను తప్ప మిగిలిన రెండింటిని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ మొదటిది పాటించాల్సింది తిరుమల వెళ్లే భక్తులే. అందుకే భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.

తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనం కోసం తిరుమల వెళ్లే వారు.. దానిని విహార యాత్రగానో మరోరకంగా భావించి వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు. కొంతమంది సందర్శకులు షాపింగ్​, విందులు, వినోదం ఎంజాయ్​ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే తిరుమలకు వస్తుంటారు. . అంతే కాకుండా ప్రాపంచిక సుఖాల కోసం అసలు వెళ్లకూడదు. కొత్తగా పెళ్లైన వారు.. ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదన్న నియమం మన పెద్దలు పెట్టడానికి కారణం కూడా ఇదే పండితులు తెలియజేస్తున్నారు.

స్వామి వారిని ఎంతో భక్తిగా దర్శనం చేసుకోవాలే తప్ప దొంగదర్శనాలు చేసుకోకూడదని పండితులు చెబుతున్నారు.

మాఢవీధుల్లో చెప్పులు వేసుకోకూడదు: మాఢవీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదని పండితులు చెబుతున్నారు. ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులు ఎంతో పవిత్రమైనవని.. అక్కడ పాదరక్షలు వేసుకుని తిరగరాదని స్థల పురాణాలు చెబుతున్నాయి.

తిరుమలలో భక్తులు పుష్పాలకు దూరంగా ఉండాలి: తిరుమలలో స్వామిని మాత్రమే పూలతో అలంకరించాలనే ఓ నియమం ఉంది. తిరుమలలో పూసిన ప్రతీ పువ్వు కూడా స్వామి వారి కైంకర్యాలకి మాత్రమే ఉపయోగించాలి. స్వామికి ఉపయోగించిన దండలు, పూలు కూడా ఎవరికీ ఇవ్వకుండా భూతీర్థంలో చూపించి అడవిలో వదిలిపెడుతుంటారు. తిరుమలలో పూసిన పుష్పాలను మహిళలు అలంకరించుకోకూడదని స్పష్టమైన నోటీసులు ఉన్నప్పటికీ, ఈ నిబంధన చాలా మంది ఉల్లంఘిస్తుంటారు.

Also Read :  మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ!

#tirumala #tirumala-darshan #Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe