నెయ్యిలో కల్తీ జరిగింది అప్పుడేనా?: సిట్ విచారణలో సంచలన విషయాలు

తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే.. అధికారులకు చెప్పారా? ఏఆర్ డెయిరీని ఎందుకు ఎంపిక చేశారు? అన్న అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణను సిట్ వేగవంతం చేసింది. సిట్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. తిరుమలలో లడ్డూ తయారీ నుంచి ప్యాకింగ్‌ వరకు ఓ బృందం పరిశీలిస్తోంది. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులనూ సిట్ ప్రశ్నించనుంది సిట్. మరో బృందం నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నెయ్యి సరఫరా, టీటీడీ, ఏఆర్‍ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలిస్తోంది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా సిట్ విచారణ చేస్తోంది. టీటీడీ బోర్డు అధికారుల నుంచి సిబ్బంది పాత్ర వరకు దర్యాప్తు చేస్తోంది సిట్. తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకోనుంది. 

తొలి రోజు ఏం చేశారంటే?


శనివారం తిరుపతికి వచ్చిన సిట్ బృందం నెయ్యి కొనుగోలు టెండర్లు, సప్లైకి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించింది. తిరుమలకు ఎప్పుడెప్పుడు ఎన్ని లారీల నెయ్యి వచ్చింది.. ఆ లారీల నంబర్లు తదితర వివరాలను పరిశీలిచింది. రివర్స్ టెండరింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ ఏ కంపెనీలు బిడ్ లు దాఖలు చేశాయి? అన్న వివరాలను సిట్ సేకరించింది. ముఖ్యంగా లడ్డూలు తయారు చేసే వారిని సైతం సిట్ ప్రశ్నించనుందని తెలుస్తోంది. నాణ్యతలో తేడాను ఎప్పుడైనా గుర్తించారా? ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏఆర్ డెయిరీ నెయ్యి, మిగతా నెయ్యికి మధ్య తేడాను ఏమైనా గమనించారా? అన్న ప్రశ్నలను అడిగి వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.  

#Tirupati Laddu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి