Nitrogen Death : నైట్రోజన్‌తో చంపేశారు.. ప్రపంచంలోనే తొలిసారి!

అమెరికాలో ఓ ఖైదీకి నైట్రోజన్‌ గ్యాస్‌ వాడి మరణ శిక్షను అమలు చేశారు. ఇలా మరణశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. ఓ మత బోధకుడి భార్యను చంపిన కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58)కు ఫేస్‌ మాస్క్‌ అమర్చి స్వచ్ఛమైన నైట్రోజన్‌ను వదలడంతో దాన్ని పీల్చి మరణించినట్లు జైలు అధికారులు చెప్పారు.

Nitrogen Death : నైట్రోజన్‌తో చంపేశారు.. ప్రపంచంలోనే తొలిసారి!
New Update

Nitrogen Death First Time in World : ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్(Nitrogen Gas) ఇచ్చి ఓ ఖైదీకి మరణ శిక్ష విధించారు. ఐక్యరాజ్యసమితి నుంచి విమర్శలు ఎదురైనా అమెరికా(America) ఈ శిక్షను అమలు చేసింది. అలబామా రాష్ట్ర ఓ మహిళను హత్య చేసిన కేసులో 58 ఏళ్ల యూజీన్ స్మిత్ ఫేస్‌మాస్క్‌ ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌‌ను పీల్చి ప్రాణాలు వదిలాడు. ముఖానికి రెస్పిరేటర్ మాస్క్(Respirator Mask) వేసి, స్మిత్(Smith) పీల్చేగాలిలో నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించారు. గాలిలో ఆక్సిజన్‌ లేకపోవడం వల్ల అతను దాదాపు ఏడు నిమిషాల్లో శిక్ష అమలు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అతడి మరణాన్ని అలబామా గవర్నర్‌(Alabama Governor) ధ్రువీకరించారు. వ్యవస్థలో లోపాలను వాడుకుని దాదాపు 4 దశాబ్ధాల పాటు తప్పించుకొన్నాడు. చివరికి తన నేరానికి శిక్ష అనుభవించాబని వ్యాఖ్యానించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన నైట్రోజన్‌ గ్యాస్‌ను వాడి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. ఐదుగురు మీడియా సభ్యులను అట్మోర్‌లోని హోల్మన్‌ కరెక్షన్‌ ఫెసిలిటీకి తీసుకెళ్లి, వారుప్రత్యక్షంగా వీక్షిస్తుండగా ఈ తతంగం అమలు చేశారు.

మరింత పరిశోధన అవసరం:
నైట్రోజన్ వాయువు పీల్చినవారు సెకనుల వ్యవధిలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఆ తర్వాత నిమిషాల్లో మరణానికి చేరువవుతారు. ఇది మనిషికి తెలిసిన అత్యంత నొప్పిలేని, మానవత్వంతో కూడిన ఉరి పద్ధతి అని ఓ ప్రభుత్వ న్యాయవాది అన్నారు. కానీ కొందరు వైద్యులు, పలు సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. నైట్రోజన్ హైపోక్సియా వల్ల మరణం సంభవిస్తుందనే దానిపై అతి తక్కువ పరిశోధనలు మాత్రమే జరిగాయని, ఈ పద్ధతిని ప్రయోగించే ముందు మరింత పరిశోధన చేసి అమలు చేయాలని అంటున్నారు.

ఒక్కొక్కరికి వెయ్యి డాలర్లు:
1988లో ఎలిజబెత్ సెనెట్‌ అనే మహిళను సుపారీ తీసుకుని చంపిన కేసులో దోషులుగా తేలిన ఇద్దరిలో స్మిత్ ఒకరు. సెనెట్‌ను చంపడానికి ఆ ఇద్దరు వ్యక్తులకు మృతురాలి భర్త పాస్టర్‌ ఛార్లెస్‌ సెనెట్‌ ఒక్కొక్కరికి వెయ్యి డాలర్లు చెల్లించారని తేలింది. ఈ కేసులో ఛార్లెస్‌ సెనెట్‌ తన భార్య ఎలిజబెత్‌ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చని ఈ కుట్ర పన్నాడు. ఈ కేసులో ఛార్లెస్‌ పేరు బయటికి రావడంతో ఎలిజబెత్‌ మరణించిన ఎనిమిది రోజులకు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కిందకు జారిపోతున్నాడా?

WATCh:

#america #alabama #nitrogen-death #nitrogen-gas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి