అమెజాన్ ప్రైమ్ డే సేల్ కాసేపట్లో ముగియనుండగా.. ఈ స్మార్ట్ ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. మోటోరోలా, శాంసంగ్ గెలాక్సీ, ఐకూ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. మోటోరోలా Razr 40 Ultra, Razr 40 ఫోన్ భారత మార్కెట్లో మొదటిసారిగా జూలై 15న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023 సమయంలో విక్రయిస్తోంది. మోటోరోలా నుంచి సరికొత్త క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు Android 13-ఆధారిత MyUXలో రన్ అవుతాయి. Qualcomm Snapdragon SoC ఆధారితమైనదిగా చెప్పవచ్చు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల OLED LTPO లోపలి ప్యానెల్‌లను కలిగి ఉంటాయి. Motorola Razr 40 Ultra 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 3,800mAh బ్యాటరీని అందిస్తుంది. అయితే, Razr 40 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది. మోటోరోలా Razr 40 Ultra ఫోన్ ధర రూ. 89,999గా ఉంది. ఏకైక 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్లలో వస్తుంది. మరోవైపు, మోటోరోలా Razr 40 సింగిల్ 8GB RAM, 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 59,999కు అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ:
శాంసంగ్ ఇండియా నుంచి గెలాక్సీ ఎం సిరీస్‌లో ఇటీవల సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ఇందులో 8జీబీ వరకు ర్యామ్, 128జీబీ స్టోరేజ్, ఎక్సినోస్ 1280 ప్రాసెసర్, 6,000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్‌లో ఈ మొబైల్ లాంఛ్ అయింది. భారీ బ్యాటరీ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒకసారి ఛార్జ్ చేసి రెండు రోజులు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 అవ్వగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఇవి ఇంట్రడక్టరీ ధరలు మాత్రమే. ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
ఐకూ ఇండియా:
7 సిరీస్‌లో ఐకూ నియో 7 ప్రో 5జీ మొబైల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఐకూ నియో 7 ప్రో 5జీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో అమొలెడ్ డిస్‌ప్లే 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.34,999 ఉండగా.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ.31,999 ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. ఐకూ నియో 7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో తక్కువ ధరకే ఈ మొబైల్ లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో ఐకూ నియో 7 ప్రో 5జీ బేస్ వేరియంట్‌ను రూ.31,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. హైఎండ్ వేరియంట్‌ను రూ.రూ.34,999 ధరకు కొనొచ్చు. నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఇప్పటికే ఐకూ నియో 7 ప్రో 5జీ ప్రీ-బుక్ చేసినవారికి రెండేళ్ల వారెంటీ లభిస్తుంది.