Chirala : ఇటీవల వైసీపీ(YCP) కి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్(Congress) తోనే ఉంటుందన్నారు. త్వరలో YS షర్మిల(YS Sharmila) ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఈ రోజు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమంచి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు సేవచేయాలనే రాజకీయాలలోకి వచ్చానన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu: వాలంటీర్లకు చంద్రబాబు గుడ్ స్యూస్.. రూ. 10 వేల పారితోషికం..!
ఇప్పుడున్న నాయకులులాగా దోచుకోవడానికి రాలేదన్నారు. బినామీలను అడ్డుపెట్టుకొని దోచుకొనేందుకే చీరాలకు కొంతమంది వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏగా ఉన్న వ్యక్తికి తెలియకుండా చీరాలలో ఏ పని జరగని పరిస్థితి నెలకొందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం వారికీ తెలిసిన విద్య అని అన్నారు. తనకు TDP, YSRCP అంటే ద్వేషం లేదన్నారు.
పర్చూరులో పోటీకి అవకాశం ఇచ్చినా.. చీరాల పై ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చానన్నారు. చీరాల నుండి పోటీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. చీరాలకు తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రజల పక్షాన ఈ ఆమంచి ఉంటాడని.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు.