Beauty Secret Of Aloe Vera : ప్రతి ఇంట్లోనూ అలోవెరా(Aloe Vera) ఈజీగా దొరుకుతుంది. ఇది ఓ సహజ మూలిక అని చెప్పొచ్చు. దీనిని వాడడం వల్ల చర్మం, జుట్టుని కాపాడుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ పెంచుకోగల ఈ మొక్క జెల్‌ని అందాన్ని కాపాడుకోవడానికి వాడొచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై మొటిమలు(Pimples), నల్ల మచ్చలు, ముడతల్ని దూరం చేస్తాయి. బ్లాక్ హెడ్స్, పిగ్మంటేషన్, మొటిమల్ని దూరం చేస్తాయి. చాలా మందికి ముఖం, చర్మంపై నల్ల మచ్చలు ఉంటాయి. వీటి వల్ల బ్యూటీని దెబ్బతీస్తాయి. చర్మ రంధ్రాల్లో మురికి పేరుకుపోవడం వల్లే ఈ బ్లాక్ హెడ్స్(Black Heads) వస్తాయి. అదే విధంగా, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కూడా బ్లాక్ హెడ్స్ పేరుకుపోతాయి. దీనిని పోగొట్టేందుకు అలొవెరా స్క్రబ్ హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం అలోవెరా జెల్లో కొద్దిగా పంచదార వేసి బాగా కలిపి సమస్య ఉన్న ప్రాంతంలో మసాజ్ చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.
పూర్తిగా చదవండి..Beauty Tips : అలోవెరా వాడండి బ్యూటీ పెంచుకోండి!
అలోవెరాను చర్మం,జట్టుకు ఉపయోగించే దివ్య ఔషదం. దీనిని వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా..జట్టు రాలుటను నివారించి ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలోవెరాలో ఉండే ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇప్పుడే చూసేయండి!
Translate this News: