అలియా భట్..కొత్తతరం బాలీవుడ్ బ్యూటీస్ లో ఆమె ఒకరు. తన క్యూట్ యాక్టింగ్ స్టైల్ తో బాలీవుడ్ ని కుర్రకారుని గుండెల్లో తిష్టవేసుకుంది. ఇటీవల ఈమె రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.
తన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా చక్కగా నటించి మెప్పించింది. తెలుగు లో కూడా ఎంతో మంది అభిమానులను అలియా సొంతం చేసుకున్నారు.
ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనివ్వడం తో అలియా సినిమాల కు కాస్త దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తన కుమార్తె బేబీ రాహా ఆలనపాలన చూసుకుంటున్నారు.
తాజాగా రణ్ వీర్ సింగ్,అలియా భట్ జంటగా నటించిన రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ జూలై 28 న విడుదల కాబోతుంది.ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యం లో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అలియా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. అందులో తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు అలియాభట్. ఈ క్రమంలో నే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అలియా కు తన కుమార్తె రాహ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ క్రమంలోనే తన కుమార్తె గురించి అలియా మాట్లాడుతూ నా కూతురు కూడా నాలా హీరోయిన్ అవ్వాలని నేను కోరుకువడం లేదు..
తాను హీరోయిన్ గా కాకుండా భవిష్యత్ లో మంచి సైంటిస్ట్ గా పేరు సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నానని తెలియజేసింది. ప్రస్తుతం అలియా చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.