CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్‌ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి?

ఏడాదికి రెండు సార్లు CBSE పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్‌పై ఒత్తిడి తగ్గుతుంది. స్కోర్‌ని కూడా పెంచుకోవచ్చు. ఇక నుంచి రెండు సార్లు బోర్డు పరీక్షలు జరగనుండగా.. వాటిలో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

CBSE exams: ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్‌ వల్ల విద్యార్థులకు ప్రయోజనం ఏంటి?
New Update

CBSE Board Exams To Be Held Twice A Year: CBSE బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనుండడం విద్యార్థులకు ప్రయోజనమేనంటున్నారు టీచర్లు. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) అప్‌డేట్ చేసిన కరికులమ్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంతో, ఇప్పుడు బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయని కేంద్రం మొన్న (ఆగస్టు 22) ప్రకటించింది. దీనివల్ల విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి విద్యార్థులకు మంచి అవకాశం అంటున్నారు నిపుణులు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ఇది విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించనుంది. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించడానికి, పరీక్షలు సులభతరం చేసినట్టు కేంద్రం చెప్పుకుంటోంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇది టర్మ్‌ వైస్‌ ఎగ్జామ్స్‌ కాదు.. రెండు పరీక్షల్లో ఏది బెస్ట్ స్కోరో దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

కొత్త నిర్ణయాలేంటి?

➼ విద్యార్థులకు అత్యధిక స్కోర్‌ను నిలుపుకునే అవకాశాన్ని అందించడానికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడం.

➼ 11, 12వ తరగతులలో స్ట్రీమ్‌లను ఎంచుకునే సౌలభ్యాన్ని విద్యార్థులకు అందించడం.

➼ 11, 12వ తరగతిలో కనీసం ఒక భాష అయినా భారతీయ భాషను అభ్యసించాలి. రెండు లాంగ్వేజ్‌ సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి

సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలపై ఓ లుక్కేయండి:

➼ విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది.

➼ విద్యార్థులు తమ స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి మరిన్ని అవకాశాలను పొందుతారు.

➼ ఏడాది పొడవునా చదువుపైనే దృష్టి పెట్టగలుగుతారు.

➼ ఇది మూల్యాంకన ప్రక్రియను మరింత సమగ్రంగా చేస్తుంది.

టీచర్లు విద్యార్థులు ఏం అంటున్నారు?
అటు టీచర్లు, విద్యార్థుల నుంచి కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఏడాదికి ఒకసారి పరీక్ష పెట్టడం కంటే ఇలా రెండుసార్లు నిర్వించడం బెస్ట్ అని.. ఎప్పటికప్పుడు స్కూల్‌లో చెప్పే విషయాలపై పిల్లలు అప్‌డేట్‌గా ఉంటారంటున్నారు టీచర్లు. తమకు కూడా బర్డెన్‌ తగ్గుతుందన్నది విద్యార్థుల మాట. ఓకేసారి లాస్ట్‌లో పరీక్షకు ప్రిపేర్ అయ్యేకంటే నాలుగు నెలలకు ఒకసారి ప్రిపేర్ అవ్వడం వల్ల అంతకముందే జరిగిన క్లాసులను మరిచిపోయే అవకాశం లేదు. ఇక సిలబస్‌ కూడా రెండు పార్టలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. అంటే ఒకేసారి మొత్తం సిలబస్‌ చదవాల్సిన అవసరం లేదు. ఇది కచ్చితంగా ఒత్తిడిని తగ్గించే అంశం. ఒకేసారి 15 చాప్టర్లు గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టం.

#cbse-exams #class-10-exams #sbse-exams-twice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి