త్రిష పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు.. అంతే ఘాటు రిప్లై ఇచ్చిన నటి!
నటి త్రిష పై సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి త్రిష కూడా అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. ఇక ముందు చేసే సినిమాల్లో అలీ ఖాన్ లేకుండా చూసుకుంటానని ఆమె పేర్కొన్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష నటించిన చిత్రం లియో. గత నెలలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, అర్జున్, సంజయ్ దత్, మన్సూర్ ఆలీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి సీనియర్ నటుడు మన్సూర్ ఆలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నటి హీరో పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు ఏం జరిగిందంటే..మన్సూర్ ఆలీ ఓ ఇంటర్వ్యూ లో లియో సినిమా గురించి మాట్లాడారు. లియో చిత్రంలో త్రిష నటిస్తున్నారని నాకు తెలిసింది. నేను కూడా ఈ సినిమాలో నటిస్తున్నా..అయితే త్రిషతో నేను చేసే సన్నివేశాల్లో ఒక్క సన్నివేశం అయినా బెడ్ రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా.. కానీ మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో త్రిషను బెడ్ రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను.
కానీ అలా జరగలేదు. నేను ఇంతకుముందు చాలా సినిమాల్లో రేప్ సీన్లు చేశాను. ఈ సీన్లు నాకు కొత్త కాదు. కానీ కశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో కనీసం సెట్స్ లో త్రిషను నాకు చూపించలేదు...అంటూ మన్సూర్ కామెంట్స్ చేశాడు. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు.
A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen…
ఆడవారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ముందుగా స్పందించే సింగర్ చిన్మయి శ్రీపాద, మలయాళ నటి మాళవిక మోహన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటన పై త్రిష కూడా స్పందించారు. ఆమె ఈ విషయం గురించి చాలా సీరియస్ అయినట్లు కనిపిస్తోంది.
మన్సూర్ ఆలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా వరకు వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగికంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అగౌరవంగా, అసహ్యకరమైనదిగా కనిపిస్తోంది. నేను అలాంటి వ్యక్తితో ఇప్పటి వరకు స్క్రీన్ ను పంచుకోనందుకు నేను చాలా అదృష్టవంతురాలిని.
నా రాబోయే సినిమాల్లో కూడా అతను లేకుండానే చూసుకుంటాను అని వివరించారు. మన్సూర్ అలీ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుంది అంటూ త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. ఇక ఈ విషయంపై త్రిషకు పలువురు సినీతారలు మద్దతు తెలుపుతున్నారు.

Also read: మా దేశం నుంచి మీ సైనికులను వెనక్కి పిలవండి..!