మాకు భాషా భేదం లేదు.. పవన్ కు నటుడు నాజర్ కౌంటర్..!

ఇటీవల 'బ్రో' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవర్స్టార్ పవన్ కల్యాణ్ తమిళ సినీ పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ మేరకు నడిగర్ సంఘం(తమిళ సినీ ఆర్టిస్ట్స్ అసోసిషయేషన్) అధ్యక్షుడు నాజర్ స్పందించారు. తమిళ సినీ పరిశ్రమలో నటులకు పరిమితులు విధిస్తూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని నాజర్ వివరించారు. పుకార్లు నమ్మవద్దని తెలిపారు. ఇతర ప్రాంతాల నటులను తమిళ సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉందన్నారు.సావిత్రి, రంగారావు లాంటి గొప్ప కళాకారులకు తమిళ సినీ పరిశ్రమ ప్రోత్సాహం అందించిందని గుర్తు చేశారు.

మాకు భాషా భేదం లేదు.. పవన్ కు నటుడు నాజర్ కౌంటర్..!
New Update

ఇటీవల 'బ్రో' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమిళ సినీ పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ మేరకు నడిగర్ సంఘం(తమిళ సినీ ఆర్టిస్ట్స్ అసోసిషయేషన్) అధ్యక్షుడు నాజర్ స్పందించారు.

publive-image

‘బ్రో’ వేడుకలో పవన్ తమిళ పరిశ్రమ అన్ని భాషలు వారికి అక్కడి సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వాలంటూ కోరారు. ఇటీవల తమిళ సినిమాల షూటింగ్ల విషయంలో అక్కడి సినీ పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయాలపై ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు సినీ పరిశ్రమలో అన్ని భాషల వాళ్లు పనిచేస్తున్నారని, ఇక్కడి పరిశ్రమ అందరికి అక్కున చేర్చుకుంటుందని ఆయన చెప్పారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు నటుడు నాజనర్ వివరణ ఇచ్చారు.

తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి వివక్షకు తావు లేదని స్పష్టం చేశారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ఇతర భాషల నటులను ప్రోత్సహిస్తున్నారని.. ఒకవేళ అలాంటి వివక్ష ఉంటే దానికి వ్యతిరేకంగా తానే మొదటగా గళం విప్పుతానని పేర్కొన్నారు.

పాన్ ఇండియా యుగం నడుస్తున్న ప్రస్తుత నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన నటుల సహకారం అవసరమని హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో చెప్పారు.

భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తం అవుతోందని దేశంలో ఏ మూలన ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బంది, నటులు ఉన్నా ప్రోత్సహించాలని సూచించారు.

తమిళ సినీ పరిశ్రమలో నటులకు పరిమితులు విధిస్తూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని నాజర్ వివరించారు. ఇతర ప్రాంతాల నటులను తమిళ సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉందన్నారు.

సావిత్రి, రంగారావు లాంటి గొప్ప కళాకారులకు తమిళ సినీ పరిశ్రమ ప్రోత్సాహం అందించిందని గుర్తు చేశారు. తమిళ సినీ పరిశ్రమపై వస్తున్న ఈ నిరాధార పుకార్లను నమ్మవద్దని నాజర్ కోరారు.

ప్రపంచ స్థాయి చిత్రాలను నిర్మించడానికి అందరూ ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు.అయితే ఇటీవల తమిళ సినీ పరిశ్రమలో కేవలం ఆ రాష్ట్ర నటులు మాత్రమే నటించాలని నిబంధనలు తీసుకువచ్చింది. దక్షిణ భారత సినిమా ఉద్యోగుల సంఘం.

చిత్రీకరణలన్నీ కేవలం తమిళనాడులోనే జరగాలని..ఇతర రాష్ట్రాలు, దేశాల్లో షూటింగ్ చేయవద్దని సూచించింది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ సంఘం అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి చెప్పారు.

#nazar-counter-to-pawan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి