Salaar : డార్లింగ్ ప్రభాస్(Prabhas) గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ తో చేయడానికి ఎంతో మంది దర్శకులు, నటులు వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రభాస్ కు బాహుబలి తరువాత అంత పెద్ద హిట్ సినిమా అంటే సలార్ అనే చెప్పవచ్చు. చాలా కాలం తరువాత ప్రభాస్ భారీ విజయాన్ని సలార్(Salaar) తో అందుకున్నాడు.
పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్ కొట్టి ఏకంగా 700 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం సలార్ సినిమా నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో కూడా సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ నుంచి రెండో పార్ట్ కూడా రానుందని దర్శక నిర్మాతలు ప్రకటించగా అభిమానులంతా దానికోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సలార్ చిత్రంలో చాలా మంది నటులు నటించారు. వారంతా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పాత్రల్లో నారంగ్(ఎంఎస్ చౌదరి)(Narang) ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ దేవా(Deva) పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దేవా నారంగ్ కొడుకుని చంపిన తరువాత పోలీసులు వరదలను, దేవాను అరెస్ట్ చేసి నారంగ్ వద్దకు తీర్పు కోసం తీసుకుని వెళ్తారు.
అక్కడ దేవా.. వరద ని ఏం చెయ్యోద్దని నారంగ్ కాళ్ల పట్టుకుంటాడు. కానీ నారంగ్ వినకుండా దేవాని తోసేసి వరద ను పట్టుకుంటాడు. దీంతో దేవా నారంగ్ తల నరికేస్తాడు. ఈ సీన్ సినిమా మొత్తానికే హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్రం గురించి నారంగ్ (ఎంఎస్ చౌదరి)(MS Chowdary) ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ప్రభాసే నా కాళ్లు...
ఈ సినిమాలో ప్రభాస్ నారంగ్ కాళ్లు పట్టుకునే సన్నివేశంలో ప్రభాస్ డూప్ చేస్తానని చెప్పినా సరే ప్రభాస్ వినకుండా ప్రభాసే నా కాళ్లు పట్టుకునే సన్నివేశం చేస్తానని చెప్పి చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ ని కొట్టే వ్యక్తిని కూడా నేను ఒక్కడినే అంటూ తెలిపారు. అంత పెద్ద స్టార్ వచ్చి నా కాళ్లు పట్టుకునే సీన్ చేయగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి అంటూ చెప్పుకొచ్చాడు.
సలార్ హిట్ అయిన తరువాత బెంగళూరు(Bangalore) లో పార్టీ ఇస్తే అక్కడికి వెళ్తే ప్రభాస్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారంటూ నారంగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ గురించి నారంగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని డార్లింగ్ అంటూ మురిసిపోతున్నారు.
Also read: 100 ఉద్యోగాల కోసం 3 వేల మంది దరఖాస్తు..క్యూలో గంటల తరబడి వెయిటింగ్!