రాజస్థాన్ బాటలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం.... కీలక నిర్ణయం తీసుకున్న భూపేశ్ బాఘేల్...! చత్తీస్‌గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలకు సన్నద్దం అవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. By G Ramu 15 Aug 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి చత్తీస్‌గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్(Bupesh Bagel) కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు(govt jobs) అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..... రాష్ట్ర ప్రజలకు ఆయన స్వాంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలకు సన్నద్దం అవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు. రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,12వ తరగతి చదవుతున్న విద్యార్థులకు ప్రముఖ సంస్థల నుంచి ఉచితంగా ఆన్ లైన్ కోచింగ్ అందించేలా చూస్తామని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందుకునేందుకు వీలుగా విద్యార్థుల కోసం పాఠశాల స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, ఇంటర్నెట్ అంశాలను పాఠాలుగా తీసుకు వస్తామన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదవుకునే విద్యార్థులను కళాశాలకు ఉచితంగా వెళ్లి వచ్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. #govt-jobs #molestation #chhattisgarh-govt #bupesh-bagel #accused మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి