ఇంటర్నెట్ లో వైరలవుతున్న నాలుగు కాళ్ల పాము..! సోషల్ మీడియాలో కనిపించిన ఓ వీడియోలో ఈ పాముకు 4 కాళ్లు ఉన్నాయి. ఈ ఎక్కడదో పూర్తిగా సమాచారం లేదు గానీ నెటిజన్లు మాత్రం ఈ వీడియోని తెగ చూస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. By Durga Rao 18 May 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి ప్రపంచంలో అనేక రకాల జీవులు ఉన్నాయి. అవి ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన రూపాన్నీ, లక్షణాలనూ కలిగి ఉంటాయి. జంతువుల లక్షణాల ఆధారంగా వాటిని పక్షులు, సరీసృపాలు, క్షీరదాలుగా వర్గీకరించారు.జీవులలో అత్యంత ప్రమాదకరమైనది పాము. పాముని చూసి సైన్యం సైతం వణికిపోతుంది అన్నది 100% నిజం. ఎందుకంటే పాములు చాలా విషపూరితమైనవి. కొన్ని పాములు కాటు వేస్తే.. చాలా త్వరగా ప్రాణం పోతుంది. ముఖ్యంగా అడవుల్లో, ఎడారుల్లో ఉండే పాముల్లో విషం ఎక్కువగా ఉంటుంది.ఈ పాము లక్షణం అందరికీ తెలిసిందే. తన జోలికి వచ్చే వారిని అవి కాటు వేస్తాయి. అందుకే పాముల నుంచి సురక్షితంగా ఉండాలని కోరుకుంటాం. ఐతే.. పాములకు కాళ్లు ఉండటం మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ లోని bali channel పేజీలో మే 5న పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ దీన్ని దాదాపు 17 వేల మంది దాకా లైక్ చేశారు. ఈ వీడియోని గమనిస్తే.. ఇందులో పాము లాంటి జీవి ఉంది. దానికి తల దగ్గర నాలుగు కాళ్లు ఉన్నాయి. పాములు సరీసృపాలు, వాటికి కాళ్లు ఉండవని అందరికీ తెలిసిందే. కానీ ఈ జీవి కొంత గందరగోళ రూపాన్ని కలిగి ఉంది. View this post on Instagram A post shared by BaliChannel (@balichannel) వీడియోలో జీవి అస్సలు కదలట్లేదు. అందువల్ల ఇది నిజమైనదేనా అనేది తెలియట్లేదు. గ్రాఫిక్స్ లో చేసి ఉంటారనే అనుమానాలు ఉన్నాయి. వీడియోతో పాటూ ఎవరికైనా ఇది ఏ జీవో తెలుసా? అని క్యాప్షన్ ఇచ్చారు. తద్వారా వీడియో అప్లోడ్ చేసిన వారికే ఇదేంటో తెలియదని అర్థమవుతోంది. నెటిజన్లు ఇది డ్రాగన్ లాగా ఉంది అంటున్నారు. #viral-news #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి