AP: రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం.. ప్రయాణికులు ఏం చేశారంటే..!

అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. గోకవరం నుండి పాతకోట వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు.

AP: రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షం.. ప్రయాణికులు ఏం చేశారంటే..!
New Update

Vishaka: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్నాయి. భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. పెద్ద పెద్ద చెట్లు రోడుకు అడ్డంగా నెలకొరిగాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాజాగా, అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం కూడూరు సమీపంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడి ఉంది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఆకుమామిడి కోట వారపు సంత కావడంతో వ్యాపారస్తుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గోకవరం నుండి పాతకోట వెళ్తున్న బస్సులోని ప్రయాణికులు చెట్టును తొలగించేందుకు ప్రయత్నాలు చేశారు.

#vishaka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి