Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and drive) లో మందుబాబుల పనిపడుతున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుక(New Year Celebrations) సందర్భంగా తప్పతాగి రూల్స్ అతిక్రమిస్తున్న మందుబాబులపై చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, పలుచోట్ల పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు మందుబాబులు. ఈ సందర్భంగానే ఓ మందుబాబు రెచ్చిపోయాడు. పోలీసు సిబ్బందిపై దాడికి చేశాడు.
Also Read: ఫ్రీ బస్ ఎఫెక్ట్.. జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.!
హైదరాబాద్ పాతబస్తీలోనూ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అయితే, ఓ మందుబాబు రెచ్చిపోయాడు. ఏకంగా పోలీసు సిబ్బందిపైనే దాడికి తెగబడ్డాడు. నా బండి ఎందుకు ఆపావంటూ మహేంద్ర సింగ్ అనే పోలీస్ పై గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా ఓ పోలీసు చెంప పగలకొట్టాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Also read: ఇంకొకసారి నా జోలికి రావద్దు’..అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్.!
కాగా, రికార్డు స్థాయి మించి మందు బాబులు పోలీసులకు పట్టుబట్టారు. డ్రైవ్ లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మంది పై కేసులు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనూ 517పైగా కేసులు నమోదు అయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కొత్త సంవత్సరం వేడుకలకు వారం రోజుల ముందే నుంచే హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికి పోలీసుల మాటలను బేకాతర్ చేస్తున్నారు మందుబాబులు.