బీమవరంలో 6కిలోల బంగారం సీజ్.. పోలీసుల అదుపులో 10 మంది

ఎలాంటి బిల్లులు, సరైన పత్రాలు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఓ ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. తగిన ఆధారాలేమీ లేకుండా ఆరు కిలోలకు పైగా బంగారాన్ని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బీమవరంలో 6కిలోల బంగారం సీజ్.. పోలీసుల అదుపులో 10 మంది
New Update

Gold seized: ఎలాంటి బిల్లులు, సరైన పత్రాలు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఓ ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. తగిన ఆధారాలేమీ లేకుండా ఆరు కిలోలకు పైగా బంగారాన్ని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

ఇది కూడా చదవండి: గూడూరులో గుట్టలుగా నోట్ల కట్టలు.. రూ. 5 కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు

భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు వారికి అనుమానాస్పదంగా కనిపించింది. దాంతో వాహనాన్ని ఆపి సోదా చేశారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. దాన్ని బయటికి తీసి ఆరు కిలోలకు పైగా ఉంటుందని నిర్ధారించారు. బిల్లులు చూపకపోవడంతో వాహనంలో ప్రయాణిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇది కూడా చదవండి: ప్రశ్న పత్రం లీకేజీ.. మాజీ ఛైర్మన్‌కు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

ఆ బంగారాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇచ్చేందుకు తరలిస్తున్నారన్న విషయాలు తెలియరాలేదు. అయితే, నిందితులు ఇంకా ఎలాంటి వివరాలు చెప్పలేదంటున్నారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు నిర్వహిస్తున్నారు. వీలైనంత తర్వగా కేసును ఛేదిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాగా, ఈ తరహా ఘటనలు ఈ మధ్య పదేపదే జరుగుతుండడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా తనికీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలు సోదా చేస్తున్నారు. అక్రమంగా బంగారం, గంజాయి, మత్తు పదార్థాలేవైనా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

#ap-crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి