Nipah Virus: నిఫా వైరస్ కలకలం.. 14 ఏళ్ల బాలుడు మృతి కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 21 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. అతడికి వైరస్ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్ సోకినట్లు వీణా జార్జ్ శనివారం తెలిపారు. పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ విషయాన్ని నిర్ధరించినట్లు పేర్కొన్నారు. అతడికి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని.. వెంటిలేటర్‌పై ఉన్నట్లు పేర్కొ్న్నారు. ఇంతలోనే ఆదివారం ఉదయం బాలుడు మృతి చెందడం కలకలం రేపుతోంది. Also Read: భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి ఆదివారం ఉదయం బాలుడికి మూత్రం ఆగిపోయిందని.. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర గుండెపోటు వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. వైద్యులు బాలుడిని బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంత్యక్రియలు చేస్తామన్నారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also read: భారీ వర్షాలు.. నిండుకుండలా మారిన జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు #telugu-news #kerala #nipah-virus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి